అమ్మమ్మ డాట్ కాం (సీరియల్) టైటిల్ సాంగ్ లిరిక్స్ - మా టీవీ సీరియల్ | సీరియల్ లిరిక్స్ | Aarde Lyrics
Album : Ammamma Dot Com [ Maa TV Serial]


Starring:Jayalalitha, Vasu Inturi, Surya Teja,Bhargav, 
Sivannarayana, Anchor Rajini, Arun Kumar, Sridhar
Music :N/A
Lyrics-Sirivenenla
Singers :N/A
Producer:N/A
Director: N/A
Year: 2010

aardelyrics.com

English Script Lyrics Click Hereఅమ్మమ్మ డాట్ కాం (సీరియల్) టైటిల్ సాంగ్ లిరిక్స్


ఏ దారమూ పంపందే వెళ్లదే ఆ మబ్బుదాకా గాలిపటం..
ఏ మార్గమూ ఏనాడూ మరవదే ఈ మట్టి తో తన చుట్టరికం..
ఉన్నపాటుగా.. కలగలేదుగా.. చందమామనే చేరే ఙ్ఞానం.
చిన్ననాటనే.. మొదలయిందిగా.. దాయి దాయనే ఊహా గానం.
నిన్నంటే ఎన్నో ప్రశ్నల భారం మోస్తూ నడిచిన కాలం.
వెన్నంటే ఆ బరువేగా చూపించింది నేడీ తీరం.
నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవసారం.
ఆ మాటే మళ్లీ కొత్తగ చెబుతుందీ అమ్మమ్మ డాట్ కాం.

అపుడు అపుడూ గతమే వెతుకు సుడిలో పడితే సలహా అడుగూ..
గడిచిన రోజులు తలవడమెందుకు ఏం లాభం అనకూ..
ఏ దిక్కులు తోచని చిక్కుల దారిని దాటిన
నాటి స్మృతి చూపద నీ ప్రగతి..
లక్షంటే తనకై  తానే వెనకకు జరిగిన ఒకటికి అర్థం..
ఆ ఒకటే లేకుంటే సున్నాలెన్నున్నా ఎందుకు వ్యర్ధం..
నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవసారం.
ఆ మాటే మళ్లీ కొత్తగ చెబుతుందీ అమ్మమ్మ డాట్ కాం.


గుహలే గృహమై ఒదిగే బ్రతుకు మహలే నెలవై ఎదిగే వరకు
ఏ ఆలోచన వేసిందో కద ఎపుడో ముందడుగూ..
ఆ రాతియుగాలను నేటి సుఖాలుగ
మలచిన ఆశలకు మొదలేదో అడుగూ..
వేగంగా రివ్వూరివ్వున గాల్లో దూసుకు పోయే బాణం
తననొదిలిన విల్లేదంటే ఏమో అంటే చేరదు గమ్యం.
నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవసారం
ఆ మాటే మళ్లీ కొత్తగ చెబుతుందీ అమ్మమ్మ డాట్ కాం.


Share This :sentiment_satisfied Emoticon