ఆశా చిన్నిఆశా సాంగ్ లిరిక్స్ రెయిన్ బో (2008) తెలుగు సినిమా | Aarde Lyrics

label

Album : Rainbow


Starring: Rahul, Sonal Chauhan, Sindhu Menon
Music : Nihal
Lyrics-J. Vara Prasad 
Singers :Sunitha 
Producer: V.N.Aditya
Director: V.N.Aditya
Year: 2008


English Script Lyrics Click Hereఆశా చిన్నిఆశా సాంగ్ లిరిక్స్లాల్లా..లాలలాలా..
ఊహూహూ.. ఆహాహాఅ
ఆశా చిన్నిఆశా నన్ను చూసె మాయగా
శ్వాసా కొత్తశ్వాసా నన్ను చేరే హాయిగా
నేను నడిచే దారిలో నాకు దొరికే తోడుగా
నేను వెతికే ఊహలో నన్ను నడిపే నావగా
ఎదురే చేరి ప్రేమించగా..

ఆశా చిన్నిఆశా నన్ను చూసె మాయగా
శ్వాసా కొత్తశ్వాసా నన్ను చేరే హాయిగా

గతంలోన కథల్లోన చూడని
పథంలోన పతంగాల ఆమని
నన్ను చూసి నాతో ఆడేనా
వనంలోని విహంగాల సారిక
ఇలా నన్ను వెతుక్కుంటు వాలగ
జంట చేరి నాతో పాడేనా
వేల వేల ఆశల్లోన సూర్యోదయం
కోటి కోటి తారల్లోన చంద్రోదయం
హరివిల్లులో కొత్త రంగునై చేరనా

ఆశా చిన్నిఆశా నన్ను చూసె మాయగా
శ్వాసా కొత్తశ్వాసా నన్ను చేరే హాయిగా

వయ్యారాల వసంతాల వాకిట
స్వరంలోన పదాలల్లి పాడగ
మేఘమాల నేనై సాగేనా
పదారేళ్ళ పసందైన కోరిక
పదా అంటు పిలుస్తున్న వేడుక
పారిజాత పువ్వై పూసేనా
గాలి నీరు నేలా నింగి దీవించగా
అంతులేని ఆనందాలే లోగిళ్ళుగా
తొలివేకువై కొత్త లోకమే చూడనా

ఆశా చిన్నిఆశా నన్ను చూసె మాయగా
లాల్లా..లాలలాల.. లాలలాల.. హాయిగా
Share This :sentiment_satisfied Emoticon