Starring:Prashanth, Heera
Music :A R Rahman
Lyrics-Rajasree
Singers :Mano, chithra, unnimenon
Producer:Mani Ratnam
Director:Mani Ratnam
Year:1993
English Script Lyrics click Here
వీర బొబ్బిలి కోటలో సాంగ్ లిరిక్స్
ఓఓఓ..ఓఓ...
వీర బొబ్బిలి కోటలో
ఉరుముల మెరుపుల అలజడిలో
ఊరే నిద్దర పోయే యేళ
సద్దేమణిగిన రాతిరి యేళ
అందెల సడి నా మనసే దోసింది
వీర బొబ్బిలి కోటలో
మాటు మణిగిన సీకటిలో
అందెల సడి నా మనసే దోసింది
వీర బొబ్బిలి కోటలో
ఉరుముల మెరుపుల అలజడిలో
గాజుల సడి నా ఎదనే దోసింది
వీర బొబ్బిలి కోటలో
ఎన్నెల కాసే యేళల్లో
పడుసుల మనసుకి గాలాలేసే
నంగనాచి దొంగలే
అందెలసడి మీ మనసులు దోసిందా
వడ్డాణం వేస్తా వయ్యారి నడుముకి
వజ్రాల అందెలు వేస్తా వగలాడి కాళ్ళకి
మణిహారం వేస్తా మెరుపంటి పిల్లకి
ముత్యాల బేసరి వేస్తా కోపాల కొమ్మకి
మీ ఆశలన్నీ
అడిఆశలంట
ఈ ఏలం పాట
మీ ఊహల పంట
నీ నోటి మాటల్లోనే
నా మనువే ఇక కుదరాలంట
నువ్వాకు వక్కా వేస్తే
నా నోరే పండాలంటా
వీర బొబ్బిలి కోటలో
మాటు మణిగిన సీకటిలో
అందెల సడి నా మనసే దోసింది
వీర బొబ్బిలి కోటలో
ఉరుముల మెరుపుల అలజడిలో
గాజుల సడి నా ఎదనే దోసింది
ఇద్దరు సూరీలొచ్చిరమ్మా
ఒంటరి తామర నలిగెనమ్మా
కత్తుల బోనే స్వయంవరమే
కలిగెను నాలో ఒక భయమే
దమయంతిని నేనమ్మా
నల మహారాజు ఎవరమ్మా
మనసైన వాణ్ణి నేనమ్మా
మహరాజును నేనే చిలకమ్మా
ఇది పరవశం నాకు
నా తనువున ఒణుకు
వెలువడదే పలుకు
తను ఎవరికి సొంతమో చెప్పాలంటే
ఏం చెబుతుంది మూగప్రాయం
నీ నోటి మాటల్లోనే
నా మనువే ఇక కుదరాలంట
నువ్వాకు వక్కా వేస్తే
నా నోరే పండాలంటా
వీర బొబ్బిలి కోటలో
మాటు మణిగిన సీకటిలో
అందెల సడి నా మనసే దోసింది
వీర బొబ్బిలి కోటలో
ఉరుముల మెరుపుల అలజడిలో
గాజుల సడి నా ఎదనే దోసింది
నీ నోటి మాటల్లోనే
నా మనువే ఇక కుదరాలంట
నువ్వాకు వక్కా వేస్తే
నా నోరే పండాలంట
వీర బొబ్బిలి కోటలో
ఎన్నెల కాసే యేళల్లో
పడుసుల మనసుకి
గాలాలేసే నంగనాచి దొంగలే
అందెలసడి మీ మనసులు దోసిందా
వీర బొబ్బిలి కోటలో
ఉరుముల మెరుపుల అలజడిలో
ఊరే నిద్దర పోయే యేళ
అందెల సడి నా మనసే దోసింది
comment 2 comments:
more_vertనీ నోటి మాటల్లోనే
నా మనువే ఇక కుదరాలంట
నువ్వాకు వక్కా వేస్తే
నా నోరే పండాలంట Bio Rockers
Such A Great Job.. sir Ji
sentiment_satisfied Emoticon