సాగర సంగమమే సాంగ్ లిరిక్స్ సీతాకోకచిలక (1981) తెలుగు సినిమా | Aarde Lyrics

Album : Seethakoka Chilaka


Starring: Karthik, Sarath Babu, Aruna
Music : Ilaiyaraaja
Lyrics-Veturi
Producer: Edida Nageshwara Rao
Director: P. Bharathiraja
Year: 1981

English Script Lyrics Cl.ick Here

సాగర సంగమమే సాంగ్ లిరిక్స్


సాగర సంగమమే
ప్రణయ సాగర సంగమమే

సాగర సంగమమే
ప్రణయ సాగర సంగమమే
కలలే అలలై ఎగసిన కడలికి
కలలే అలలై ఎగసిన కడలికి
కలలో ఇలలో..
కలలో ఇలలో దొరకని కలయిక

సాగర సంగమమే
ప్రణయ సాగర సంగమమే

కన్యాకుమారి నీ పదములు నేనే
..ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
కన్యాకుమారి నీ పదములు నేనే
కడలి కెరటమై కడిగిన వేళా
సుమ సుకుమారీ నీ చూపులకే
తడబడి వరములు అడిగిన వేళా

అలిగిన నా పలు అలకలు
నీలో పులకలు రేపి పువ్వులు విసిరిన
పున్నమి రాతిరి నవ్విన వేళా
సాగర సంగమమే..
ప్రణయ.. సాగర సంగమమే

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

భారత భారతి పద సన్నిధిలో
కులమత సాగర సంగమ శృతిలో
నా రతి నీవని.. వలపుల హారతి
హృదయము ప్రమిదగా వెలిగిన వేళా

పరువపు ఉరవడి పరువిడి నీ ఒడి
కన్నుల నీరిడి కలిసిన మనసున
సందెలు కుంకుమ చిందిన వేళా

సాగర సంగమమే..
ప్రణయ.. సాగర సంగమమే
సాగర సంగమమే... 
Share This :sentiment_satisfied Emoticon