రాశాను ప్రేమలేఖలెన్నో సాంగ్ లిరిక్స్ శ్రీదేవి (1970) తెలుగు సినిమా | Aarde Lyrics

Album : Sri Devi


Starring: Haranath, Vijaya
Music : G K Venkatesh
Lyrics-Arudra 
Singers :S.P. BaluJanaki 
Producer: R.S Narayana
Director: B.S Narayana
Year: 1970

Telugu Script Lyrics Click Here

రాశాను ప్రేమలేఖలెన్నో సాంగ్ లిరిక్స్
రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే
దివిలోన తారకలాయే నీ నవ్వులే

రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే 
దివిలోన తారకలాయే నీ నవ్వులే

కొమ్మల్లో కోయిలమ్మా.. కోయ్ అన్నది
కొమ్మల్లో కోయిలమ్మా కోయ్ అన్నది
నా మనసు నిన్నే తలచీ ఓయన్నదీ
మురిపించే ముద్దు గులాబి మొగ్గేసింది
చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది

రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే
దివిలోన తారకలాయే నీ నవ్వులే

ఆ.... ఆ.... ఆ.... ఆ.... ఆ...
నీ అడుగుల సవ్వడి ఉందీ నా గుండెలో ఊహూ..
నీ చల్లని రూపం ఉందీ నా కనులలో హా
నాలోని సోయగమంతా విరబూసెలే
నాలోని సోయగమంతా విరబూసెలే
మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే

రాశాను ప్రేమలేఖలెన్నో 
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే
దివిలోన తారకలాయే నీ నవ్వులే

ఊ..ఊ..ఊ..ఊ...ఊ... ఆ... ఆ..
అందాలా పయ్యెద నేనై ఆటాడనా ఆ..
కురులందు కుసుమం నేనై చెలరేగనా.. ఆ..
నీ చేతుల వీణను నేనై పాట పాడనా
నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా

రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో 
ఆ.... ఆ.... ఆ.... ఆ.... ఆ...
Share This :sentiment_satisfied Emoticon