పాటమ్మతోటే ప్రాణం నాకు సాంగ్ లిరిక్స్ పాటమ్మతోటే ప్రాణం-Folk Album (2019) జానపద గేయాలు | Aarde Lyrics

Album : Patammathone Praanam (Folk Album)

Starring: Rambabu Yasarapu, Kalyan Keys
Music : Kalyan Keys
Lyrics-Rambabu Yasarapu
Singers :Rambabu Yasarapu 
Producer: Ganga (Sahithi), Sudharshan Perambdhur
Director: NA
Year: 2020

English Script Lyrics Click Here

పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా..
పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా…
అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా…
వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా..
వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కను దారను నేను రా..
ఉన్నా రెండు ఎకరాలను కళ్ళ సూడలే..
మా నాన్న నాగలి కర్రు పెట్టి.. పొలమూ దున్నలే.. (2x)
కట్నం కింద అంతా అక్కకు రాసిచ్చినం… (2x)
మా అక్కను బావ కొడితే ఎక్కీ ఎక్కీ ఏడ్చినం..
చెప్పేటోడు లేక పది ఫెయిలయిపోయినా… (2x)
సదువమ్మా విలువ తెలిసీ… ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా..

పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా..
పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా…
అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా…
వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా..
సిరిగిన అంగీ లాగులేసుకొని.. బాల్యమంత గడిపినా..
బత్త సంచిల బుక్కులేసుకొని.. బడికి రోజు నేను పోయినా…. (2x)
అమ్మ నాన్న వాళ్ళ నెత్తురిని..
సత్తువగా జల్లే నన్ను సాదిండ్రు..
రెండు చేతుల్లో పొడిచిన పొక్కుల భాధను..
గుండెల్లో దాసుకుండ్రు…

ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను..ఓ.. నాన్నా….. (2x)
ఈ భాదలు బందయ్యె రోజు తెస్తనే… జన్మనిచ్చిన అమ్మా..
పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా..
పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా…
అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా…
వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా..
కళ్ళకు జారిన కన్నీళ్ళతో పాటలెన్నో రాస్తా.. (2x)

మహనీయుల త్యాగాల దారిలో.. నా గొంతును వినిపిస్తా..
అక్షరాల ఉక్కు పిడికిళ్ళకు.. ఊపిరి పాటౌతా.. (2x)
చీకటి బతుకుల్లో వెలుగుల్ల రాగమై.. దారులు నేనేస్తా..
జ్ఞానం కోసం ధ్యానం చేసిన.. శంభూకునౌతా…
సదువమ్మ బాటలో పాటను నేనై…
స్వేరో జెండాను గుండెకత్తుకుంటా…
పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా..
పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా…

అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా…
వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా..
వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా..
Share This :

sentiment_satisfied Emoticon