చావైనా బతుకైనా సాంగ్ లిరిక్స్ స్క్రీన్ ప్లే (2020) తెలుగు సినిమా | Aarde Lyrics





Album : Screenplay


Starring: Vikram Shiva, Pragathi Yadhati
Music : M.M. Sreelekha
Lyrics-K.L.Prasad 
Singers :M.M. Sreelekha, Hemachandra
Producer: Dr. K Arunakumari
Director: K.L.Prasad
Year: 2020

Telugu Script Lyrics Click Here





చావైనా బతుకైనా సాంగ్ లిరిక్స్


చావైనా బతుకైనా.. నీతోనే ప్రియతమా!
మనసంతా తనువంతా.. నీదేలే నేస్తమా!

సమరానికి శ్వాసనై.. ప్రాణమై వెలుగనా..
నువ్వే నేనుగా.. నేనే నువ్వుగా..
బతుకంతా నీతోనే సాగనా..

ప్రేమతో.. ప్రేమగా.. ప్రేమిస్తా..
నీ ప్రేమంతా దోచేస్తా…

చావైనా బతుకైనా..
నీతోనే ప్రియతమా!

మట్టిని నమ్మిన పేదల మనిషిని..
మనిషిని మనిషిగా చూసిన  మనసిది..

కాల్చే ఆకలి..
కూల్చే వేదన..

పచ్చని సీమకి.. చేర్చే సాధన..
పోరు కేకలు.. వేడి తలపులు..
నేర చరితలు.. తీపి గురుతులు..

కాదు అని.. లేదు అని.. వలదని..
వాదనలు నాకు వినపడవని..

నీ అడుగు.. నా అడుగు..
కలిసి ఈ పయనంలో..

చావైనా బతుకైనా.. నీతోనే ప్రియతమా!
మనసంతా తనువంతా.. నీదేలే నేస్తమా!

సమరానికి శ్వాసనై.. ప్రాణమై వెలుగనా..
నువ్వే నేనుగా.. నేనే నువ్వుగా..
బతుకంతా నీతోనే సాగనా..

ప్రేమతో.. ప్రేమగా.. ప్రేమిస్తా..
నీ ప్రేమంతా దోచేస్తా… (2x)
Share This :



sentiment_satisfied Emoticon