ఊరెళ్ళి పోతా మామ సాంగ్ లిరిక్స్ చౌరస్తా (2019) తెలుగు సినిమా | Aarde Lyrics
Album : ChowRaasta (Private Album)


Starring: Ram Miriyala, Anand Gurram
Music : ChowRaasta Music
Lyrics-Anand Gurram, Ram Miriyala 
Singers :Ram Miriyala 
Producer: ChowRaasta Music
Director: ChowRaasta Music
Year: 2019

English Script Lyrics Click Here

ఊరెళ్ళి పోతా మామ సాంగ్ లిరిక్స్ఊరెళ్ళి పోతా మామ..
ఊరెళ్ళి పోతా మామ..
ఎర్ర బస్సెక్కి మళ్ళి…
తిరిగెళ్లిపోతా మామ..
ఏ ఊరెళ్తావ్ రామ..
ఏముందని ఎళ్తావ్ రామ.
ఊరన్న పేరే తప్ప..
తీరంతా మారే రామ.

నల్లమల అడవుల్లోన..
పులిచింత చెట్ల కింద.
మల్లెలు పూసేటి.. చల్లని పల్లె ఒకటుంది.
మనసున్న పల్లె జనం..
మోసం తెలియని తనం.
అడవి ఆ పల్లె అందం..
పువ్వు తేనెల సందం.

నల్లమల అడవుల్లోన..
పులిచింత చెట్ల కింద.
పుత్తడి గనుల కోసం..
చిత్తడి బావులు తొవ్వే.
పుత్తడి మెరుపుల్లోన..
మల్లెలు మాడిపోయే.
మనసున్న పల్లె జనం..
వలసల్లో చెదిరిపోయే.

ఏ ఊరెళ్తావ్ రామ..
ఏముందని ఎళ్తావ్ రామ.
ఊరన్న పేరే తప్ప..
తీరంతా మారే రామ.

ఏ ఊరెళ్తావ్ రామ..
ఏముందని ఎళ్తావ్ రామ.
ఊరన్న పేరే తప్ప..
తీరంతా మారే రామ.

గోదారి లంకల్లోన..
అరిటాకు నీడల్లోన.
ఇసుక తిన్నెలు మీద..
వెండి వెన్నెల్లు కురువ..
గంగమ్మ గుండెల్లోన..
వెచ్చంగా దాచుకున్న.
సిరులెన్నో పొంగి పొర్లే..
పచ్చని పల్లెకటుంది..

గోదారి లంకల్లోన..
అరిటాకు నీడల్లోన.
ఇసుకంతా  తరలిపోయే..
వెన్నెల్లు రాలిపోయే.
ఎగువ గోదారిపైనా.. ఆనకట్టలు వెలిసే.
ఆపైన పల్లెలన్నీ.. నిలువునా మునిగిపోయే.

ఏ ఊరెళ్తావ్ రామ..
ఏముందని ఎళ్తావ్ రామ.
ఊరన్న పేరే తప్ప..
తీరంతా మారే రామ.
Share This :sentiment_satisfied Emoticon