Music :Ghantasala, Saluri Rajeswara Rao
Lyrics-Pingali Nagendra Rao
Singers :Ghantasala, Leela
Producer:B. Nagi Reddy, Aluri Chakrapani
Director:Kadiri Venkata Reddy
Year:1957
Telugu Script Lyrics Click Here
విన్నావ యశోదమ్మా సాంగ్ లిరిక్స్
గోపికలు : విన్నావ యశోదమ్మా! "2"
మీ చిన్ని కృష్ణుడు చేసినట్టి
అల్లరి చిల్లరి పనులు విన్నవ యశోదమ్మ
యశోద : అన్నెం పున్నెం ఎరుగని పాపడు
మన్నుతినే నా చిన్నితనయుడు
ఏమి చేసెనమ్మా ఎందుకు రవ్వ చేతురమ్మా.
గోపికలు : ఆ... మన్ను తినేవాడా? వెన్న తినేవాడా?
కాలిగజ్జెల సందడి చేయక
పిల్లివలె మా ఇంట్లో దూరి "కాలి"
ఎత్తుగ కట్టిన ఉట్టందుకుని
దుత్తలన్నీ క్రింద దించుకుని "ఎత్తు"
పాలన్నీ తాగేశనమ్మా.
పెరుగంతా జారేశనమ్మా,
వెన్నంతా మొక్కేశనమ్మా
కృష్ణుడు : ఒక్కటే ఎట్లా తినేశనమ్మా?
కలదమ్మా, ఇది ఎక్కడనైనా కలదమ్మా?
విన్నావటమ్మా.... విన్నావటమ్మ
ఓ యశోదా! గోపిక రమణుల కల్లలూ
ఈ గోపిక రమణుల కల్లలూ...
గోపికలు : ఆ... ఎలా బూకరిస్తున్నాడో!
పోనీ పట్టిద్దామంటే చిక్కుతాడా!
భామలందరొక యుక్తిని పన్ని
గమ్మము నొకరుగ కాచియుండగా
ఒకరింట్లో విని గజ్జెల గలగల
ఒకరింట్లో విని వేణుగానమూ "ఒకరింట్లో"
ఆహా: ఇంకేం
దొంగ దొరికెనని పోయిచూడగా
ఛంగున నెటకో దాటిపోయే
ఎలా వచ్చెనో ఎలా పోయెనో
చిలిపి కృష్ణుడనే అడుగవమ్మా..."ఎలా"
కృష్ణుడు : నాకేం తెలుసు నేనిక్కడ లేందే!
యశోద : మరి ఎక్కడున్నావు?
కృష్ణుడు : కాళింది మడుగున విషమును కలిపె
కాళియ తలపై తాండవమాడి "కాళింది"
ఆ విషసర్పము నంతము జేసి
గోవుల చల్లగ కాచనే..."౩"
ద్రౌపది: హే కృష్ణా... హే కృష్ణా....
ముకుందా మొరవినవా,
నీవు వినా దిక్కెవరు దీనురాలి గనవా కృష్ణా
నా హీన గతిని గనవా....కృష్ణా కృష్ణా కృష్ణా....
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon