Album : Surya Vs Surya
Starring: Nikhil, Trida Chowdary
Music : Satya Mahaveer
Lyrics- Krishna Madineni
Singers : chinmaye
Producer:Malkapuram Shivakumar
Director: MLR Karthikeyan
మనసంతా నేనై పోనా
వేకువలో తూరుపులా నీకోసం నేనున్నా
తూరుపులో వేకువలా నాకోసం రావేలా
వెన్నెల్లోన మౌనం నన్నే అడిగిందీ
ఏమైందీ నీకంటూ
గుండెల్లోన కడలీ అలలై ఎగసిందీ
ప్రేమంటే నువ్వంటూ
ఈ రేయిలోన నే నిలువలేక
ఏ వెలుగులేక నే గడుపలేక
ఓ నిముషమైన నిను విడువలేక
నీ ఎదుట నన్ను నే దాచలేక
నా నిదుర నైన నిను మరువలేక
నా కలలలోన నిను కలువలేక
ఒ క్షణమునైన నీ తోడు కోరి నేనున్నా
వెన్నెల్లోన మౌనం నాతో అంటుందీ
నువ్వుంటే చాలంటూ
ఓ...ఓ..ఓ..ఓ..
మౌనం లో మాటై పోయా
మనసంతా నిండిపోయా
వేకువలో తూరుపులా నాకోసం నువ్వొస్తే
తూరుపులో వేకువలా నీకోసం నేనున్నా
వెన్నెల్లోనా మౌనం మాటై పలికింది
నువ్వంటే నేనంటూ....
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon