రవివర్మకే అందని ఒకే ఒక అందానివో సాంగ్ లిరిక్స్ రావణుడే రాముడైతే ( 1979) తెలుగు సినిమా


Album : Ravanude Ramudayithe

Starring: Akkineni Nageswara Rao, Latha, Jayachitra
Music : G. K. Venkatesh
Lyrics-Veturi 
Singers :Balu, Janaki
Producer: N. R. Anuradha Devi
Director: Dasari Narayana Rao
Year: 1979
Telugu Script Lyrics CLICk HEREఆ .. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ...
ఆ .. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ...
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
ఆ..ఆ... ఆ
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో.. ఆ .. ఆ.. ఆ..
రవి చూడని.. పాడని.. నవ్యనాదానివో...
రవివర్మకే... ఆ .. ఆ..   అందని... ఆ .. ఆ..  ఒకే ఒక అందానివో... 

ఏ రాగమో.. తీగదాటి ఒంటిగా నిలిచే
ఏ యొగమో.. నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగభావాలో.. అనురాగ యోగాలై....
ఆ.. ఆ... ఆ.. ఆ... ఆ.. ఆ
నీ పాటలే పాడనీ..
రవివర్మకే... ఆ .. ఆ.. ఆ..  అందని... ఆ .. ఆ.. ఆ..  ఒకే ఒక అందానివో... 

ఏ గగనమో కురులు జారి.. నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి.. కుంకుమై పోయే
ఆ కావ్య కల్పనలే.. నీ దివ్య శిల్పాలై
ఆ .. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ...
కదలాడనీ.. పాడనీ..

రవివర్మకే...  అందని.. ఒకే ఒక అందానివో...
ఆ .. ఆ.. ఆ....
రవి చూడని.. పాడని.. నవ్యనాదానివో...
రవివర్మకే.. ఆ.. ఆ... అందని.. ఆ.. ఆ...
ఒకే ఒక అందానివో...
Share This :sentiment_satisfied Emoticon