ఏమాయ చేసిందో సాంగ్ లిరిక్స్ వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి (2019)) తెలుగు సినిమా


Album : Where is The Venkatalakshmi

Starring: Raai Laxmi, Madhu Nandan
Music : Hari Gowra
Lyrics-Balaji
Singers :Hari Gowra 
Producer: M Sridhar Reddy, H Anand Reddy and RK Reddy
Director: Kishore (Ladda)
Year: 2019

English Script Lyrics CLICK HEREఏమాయ చేసిందో
ఏమంత్రం వేసిందో
చూపుల్తో తీసిందే ప్రాణం
ఊరించే ఆ అందం
ఊహల్లో ఆనందం
గుండెల్లో గుచ్చిందే బాణం

ఆ కులుకే ఓ చురకై
ఈ గొడవే తెచ్చిపెట్టిందే
ఆ హొయలే ఓ రైలై
లోలోపల కూతే పెట్టిందే
చల్లేసి పోయిందే ఆ సోయగాలు
పిండేసినట్టుందే ఒంట్లో నరాలు
పెట్టేసి పోయిందే బుగ్గ సంతకాలు
కట్టేసినట్టుందే ఈ సంతోషాలూ

ఏమాయ చేసిందో
ఏమంత్రం వేసిందో
చూపుల్తో తీసిందే ప్రాణం
ఊరించే ఆ అందం
ఊహల్లో ఆనందం
గుండెల్లో గుచ్చిందే బాణం

నోరంతా ఊరేటట్టు
ఉంటాదే నీతో జట్టు
ఆ కట్టు బొట్టూ చూస్తుంటే
నీ గుట్టే తేనెపట్టు
తింటామే కాస్త పెట్టు
దూరంగా పోమాకే ఒట్టూ
ఏ మందు చల్లేశావో
నీలో అందం తీసి
మాకోసం పుట్టావే రాకాసీ
ఏ తిండీ తిప్పల్లేవు
నీపై కన్నే వేసీ
కళ్ళన్నీ తిప్పావే నీకేసి
ఎదుటే పడితే చిలకా
ఎదలో పడదా మెలిక
వలలే విసిరి మాపై
కలలో కలిసి ప్రేమై

ఏమాయ చేసిందో
ఏమంత్రం వేసిందో
చూపుల్తో తీసిందే ప్రాణం
ఊరించే ఆ అందం
ఊహల్లో ఆనందం
గుండెల్లో గుచ్చిందే బాణం 

Share This :sentiment_satisfied Emoticon