ఏమిటో ఈ సంబరం సాంగ్ లిరిక్స్ రుణం (2018) తెలుగు సినిమా


Album : Runam

Starring: Gopi Krishn, Shilpa
Music : S.V.Mallik Teja
Lyrics-S.V.Mallik Teja 
Singers :Haricharan, Chinmayi 
Producer: Bheemineni Suresh, Ramakrishna Rao
Director: S.Gundreddy
Year: 2018
Telugu Script LYrics CLICK HERE


ఏమిటో ఈ సంబరం
అందుతోందీ అంబరం
ఈ రుణం ఏ జన్మ పుణ్యం
ఎందుకో ఈ పూవనం
వెంటపడుతోంది ఈ క్షణం
కారణం నువ్వల్లిన బంధం
ఓ అలాఎలా మిలామిలా
ఈ మెరుపులు సాధ్యమో
నీ కిలకిల గలగల
పలుకులెలా ఆరాధ్యమో

ఈ అలజడి ఏంటో
కలబడి నిత్యం
గొడవ చేస్తోందీ
ఈ పండుగ ఏంటో
గుండెలొ మొత్తం
రంగులు పూస్తోందీ

గుండెలోనా ఇన్ని నాళ్ళూ
మిగిలినా దిగులే ఇపుడే
పారిపోయిందా
జీవితానా కొత్తవెలుగు
కోరకుండానే వరమై
చేరిపోయిందా
ఆగితే బాగుండు కద
ఈ సమయం ఇలాగే
ఆగితే బాగుండు కద
ఈ సమయం ఇలాగే
కలకాదే కథ కాదే ఇది నిజమే
చెలి మీదే చెరగనిదే ఈ ప్రేమే

ఈ అలజడి ఏంటో
కలబడి నిత్యం
గొడవ చేస్తోందీ
ఈ పండుగ ఏంటో
గుండెలొ మొత్తం
రంగులు పూస్తోందీ

ఇంతవరకూ ఇంత పరుగు
లేదు కదా ఏమయ్యిందో
నా అడుగులకు
నీ వల్లనే నా మనసిలా
రెక్కలను తొడిగేస్తుంది
నా ఊహలకూ
ఉండనీ ఉల్లాసమిక
ఏనాడు ఎటు వెళ్ళకా
ఉండనీ ఉల్లాసమిక
ఏనాడు ఎటు వెళ్ళకా
పరవశమే పావనమే ప్రేమంటే
నాలోనీ ప్రాణమే నీవంటే

ఈ అలజడి ఏంటో
కలబడి నిత్యం
గొడవ చేస్తోందీ
ఈ పండుగ ఏమో
గుండెలొ మొత్తం
రంగులు పూస్తోందీ

ఏమిటో ఈ సంబరం
అందుతోందీ అంబరం
ఈ రుణం ఏ జన్మ పుణ్యం
ఎందుకో ఈ పూవనం
వెంటపడుతోంది ఈ క్షణం
కారణం నువ్వల్లిన బంధం
ఓ అలాఎలా మిలామిలా
ఈ మెరుపులు సాధ్యమో
నీ కిలకిల గలగల
పలుకులెలా ఆరాధ్యమో

ఈ అలజడి ఏంటో
కలబడి నిత్యం
గొడవ చేస్తోందీ
ఈ పండుగ ఏంటో
గుండెలొ మొత్తం
రంగులు పూస్తోందీ
Share This :sentiment_satisfied Emoticon