ప్రేమిస్తే ఏమవుతుంది సాంగ్ లిరిక్స్ భలే అల్లుడు (1977) తెలుగు సినిమా
Album : Bhale Alludu

Starring: Krishnam Raju, Sharada, Mohanbabu, Padmapriya
Music : J.V. Raghavulu
Lyrics-Aatreya 
Singers : Sp Balu, Suseela
Producer: K. Vitaleswara Rao, K.N. Chowdary
Director: P. Chandrasekhara Reddy
Year: 1977
English Script Lyrics CLICK HEREప్రేమిస్తే ఏమవుతుంది?.. హ్మ్... హ్మ్... పెళ్ళవుతుంది
పెళ్ళైతే ఏమవుతుంది? .. ఆహహ ఏమవుతుంది.. ఒక ఇల్లవుతుంది

ప్రేమిస్తే పెళ్లవుతుంది .. పెళ్ళైతే ఇల్లవుతుంది
ప్రేమకు ఒక ఊపొస్తుందీ... హొయ్ హొయ్ హొయ్
పెళ్ళికి ఒక రూపొస్తుంది.. ఆహా.. పెళ్ళికి ఒక రూపొస్తుంది

మనసుంటే ప్రేమ తానె పుట్టుకొస్తుందీ
వయసొస్తే వద్దన్నా నెట్టుకొస్తుందీ..
పగ్గాలు తెంచుకొని పరుగులెత్తుతుంది
పసుపు తాడు పడగానే అదుపులోకి వస్తుంది

ప్రేమిస్తే పెళ్లవుతుంది .. పెళ్ళైతే ఇల్లవుతుంది
ప్రేమకు ఒక ఊపొస్తుందీ..  హొయ్ హొయ్ హొయ్
పెళ్ళికి ఒక రూపొస్తుంది.. ఆహా.. పెళ్ళికి ఒక రూపొస్తుంది

ప్రేమంటే వెన్నెల్లా చల్లనైనది
ప్రేమంటే తేనెలా తీయనైనది
ప్రేమంటే అదో రకం పిచ్చి వంటిది
పెళ్ళే ఆ పిచ్చికి మందు వంటిదీ

ప్రేమిస్తే పెళ్లవుతుంది .. పెళ్ళైతే ఇల్లవుతుంది
ప్రేమకు ఒక ఊపొస్తుందీ... హొయ్ హొయ్ హొయ్
పెళ్ళికి ఒక రూపొస్తుంది..ఆహా..పెళ్ళికి ఒక రూపొస్తుంది

నిన్న మొన్న దాక నిన్ను నువ్వెవ్వరు అన్నది
వలపు మొలిచినంతనే నువ్వే నేనంటుంది
నువ్వు లేక నేలేనని.. పువ్వు తావి మనమని
గుండెలోన దాగుతుంది.. కోరికలు రేపుతుంది 

ప్రేమిస్తే పెళ్లవుతుంది .. పెళ్ళైతే ఇల్లవుతుంది
ప్రేమకు ఒక ఊపొస్తుందీ... హొయ్ హొయ్ హొయ్
పెళ్ళికి ఒక రూపొస్తుంది..ఆహా..పెళ్ళికి ఒక రూపొస్తుంది...  
Share This :sentiment_satisfied Emoticon