ప్రేమ వెన్నెలా సాంగ్ లిరిక్స్ చిత్రలహరి (2019) తెలుగు సినిమా


Album : Chitralahari
Starring: Sai Dharam Tej, Kalyani Priyadarshan
Music : Devi Sri Prasad
Lyrics-Srimani
Singers :Sudharshan Ashok
Producer: Naveen Yerneni, Y. Ravi Shankar and Mohan Cherukuri (CVM)
Director: Kishore Tirumala
Year: 2019
English Script LYrics CLICK HERE


రంగురంగు పువ్వులున్న అందమైన తోటలో 
ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 
ఏడు రంగులు ఒక్కటై పరవశించు వేళలో 
నేలకే జారిన కొత్త రంగులా 
వానలా వీణలా వాన వీణ వాణిలా 
గుండెలో పొంగిన కృష్ణ వేణిలా
ఒంటరి మనసులో ఒంపి వెల్లకే ఆలా 
సరిగమల్ని తియ్యగా ఇలా 

ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా 

రంగురంగు పువ్వులున్న అందమైన తోటలో 
ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 
ఏడు రంగులు ఒక్కటై పరవశించు వేళలో 
నేలకే జారిన కొత్త రంగులా 
దిద్దితే నువ్వలా కాటుకే కన్నుల 
మారదా పగలిలా అర్థరాత్రి లా 
నవ్వితే నువ్వలా 
మెల్లగా మిల మిల
కలవరం గుండెలో కలత పూతలా

రాయలోరి నగలలోంచి 
మాయమైన మణులిలా
 మారిపోయెనేమో నీ రెండు కళ్లలా 
నిక్కమైన నీలమొకటి చాలు అంటూ వేమన 
నిన్ను చూసే రాసినాడలా

ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా 

నడకే  నువ్వలా
కలలలో కోమల ఆ... ..
నడకే నువ్వలా
కలలలో  కోమల 
పాదమే కందితే 
మనసు విల విలా 
విడువకే నువ్వలా
పలుకులే గల గల
పెదవులు అదిరితే 
గుండె గిల గిల 

అంతు లేని అంతరిక్షమంతు
చూడకే అలా
నీలమంతా దాచిపెట్టి
వాలు కన్నులా
ఒక్కసారి గుండెలోకి 
అడుగుపెట్టి రా ఇలా
ప్రాణమంతా పొంగిపోయేలా

ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా 
Share This :sentiment_satisfied Emoticon