ప్రయత్నమే మొదటి విజయం (ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే) సాంగ్ లిరిక్స్ చిత్రలహరి (2019) తెలుగు సినిమా


Album : Chitralahari
Starring: Sai Dharam Tej, Kalyani Priyadarshan
Music : Devi Sri Prasad
Lyrics-Chandrabose
Singers :Kailash Kher & Vishnupriya Ravi
Producer: Naveen Yerneni, Y. Ravi Shankar and Mohan Cherukuri (CVM)
Director: Kishore Tirumala
Year: 2019
English SCript Lyrics Click HEre



ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే
అవకాశం పొందడమే

అడుగు అడుగు వెయ్యనిదే
అంతరిక్షము అందేనా
పడుతూ పడుతూ లేవనిదే
పసి పాదం పరుగులు తీసేనా
మునిగి మునిగి తేలనదే
మహా సంద్రమే లొంగేనా
కరిగి కరిగి వెలగనిదే
కొవ్వొత్తి చీకటిని తరిమేనా
ముగింపు ఏమైనా
మధ్యలో వదలొద్దురా..
ఈఈ సాధనా 

ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన  ఆయుధం
ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన  ఆయుధం

ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే
అవకాశం పొందడమే

వెళ్లే దారుల్లోనే రాళ్లే అడ్డొస్తున్న
అడ్డుని కాస్త మెట్టు గా మలిచి
ఎత్తుకు ఎదగాలి
చేసే పోరాటం  లో రక్తం చిందేస్తున్నా
అది ఎర్ర సిరా గా నీ చరితను
రాస్తుందనుకోవాలి....
అడుగంటు వేసాకా ఆగకుండా సాగాలి రా 
నీ సాధన..

ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన  ఆయుధం
ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన  ఆయుధం

ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే
అవకాశం పొందడమే


Share This :



sentiment_satisfied Emoticon