అనగనగా ఒక ఊరు సాంగ్ లిరిక్స్ హలో (2017) తెలుగు సినిమా


Album : Hello

Starring: Akhil Akkineni, Kalyani Priyadarshan
Music :Anup Rubens
Lyrics-Chandrabose
Singers :Shreya Goshal
Producer:Akkineni Nagarjuna
Director: Vikram K Kumar
Year: 2017
English Script Lyrics CLICK HERE

అనగనగా ఒక ఊరు
అనుకోకుండ ఒక నాడు
కలిసారే పసివాళ్లు స్నేహంగా
సంతోషమంత రెక్కలుగా
రివ్వంటు ఎగిరే పక్షులుగా
ఆకాశమంత ఆటాడుకుంటూ
ఉన్నారు సరదాగా

ఒకరేమో సీను ఒకరేమో జున్ను
కలిసారే ప్రాణంగ కురిసారె వర్షంగ
పాటేమో సీను ఆటేమో జున్ను
ఒకటై ఎదిగారే మధురంగ

ప్రపంచమంత తమ ఇల్లంటు
ప్రతి క్షణం ఒక పండుగగా
కన్నీరు లేని కలలే కంటూ
చిన్నారి చెలిమే బలపడగా

తియ తియ్యని ఊసులతో
తెల్ల తెల్లని మనసులలో
కథ ఇలాగా మొదలయ్యేగా
కథ ఇలాగా మొదలయ్యేగా

అనగనగా ఒక ఊరు
అనుకోకుండ ఒక నాడు
కలిసారే పసివాళ్ళు స్నేహంగా

ఎగిరిన బుడగలలోన చెలిమే
ఉరికిన పడవలలోన చెలిమే
రంగుల రాట్నంలో చెలిమే
చిందులు వేసిందే
మిణుగురు వెలుగులలోన చెలిమే
తొలకరి తేనెలలోన చెలిమే
గాజుల గలగలలో చెలిమే
సందడి చేసిందే
ఈ జ్ఞాపకాలన్నీ నిలిచేనులే
ఈ జీవితానికి బలమై నడిపేనులే
ఈ సాక్ష్యాలే అనుబంధాల
భవనానికి స్తంభాలే

అనగనగ ఒక ఊరు
అనుకోకుండ ఒక నాడు
కలిసారే పసివాళ్లు స్నేహంగ

తెలపని కబురులలోన చెలిమే
తిరగని మలుపులలోన చెలిమే
దొరకని చేపలలో చెలిమే
దోసిలి నింపిందే
జరిగిన నిమిషములోన చెలిమే
ఎరగని మరు నిమిషాన చెలిమే
కాలం చెక్కిలిలో చెలిమే
చుక్కై మెరిసిందే 

చిననాడు మురిపించే ఈ గురుతులే
కనరాని దారిని చూపే మీ గురువులే
ఉండాలంటూ ఈ బతుకంతా
మాటలకి కట్టుబడి
Share This :sentiment_satisfied Emoticon