రెచ్చిపోదాం బ్రదర్..సాంగ్ లిరిక్స్ F2 (2019) తెలుగు సినిమా

label
label

Album : F2
Starring: Varun Tej,Venkatesh, Mehreen, Tamannah
Music : Devi Sri Prasad
Lyrics-Kasarla Shyam
Singers :David Simon
Producer: Shirish, Lakshman
Director: Anil Ravipudi
Year: 2018

ఈ పాట ఇంగ్లీష్ లో పొందడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

క్రికెట్టాడే బంతికి రెస్టే 
దొరికినట్టు ఉందిరో
నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిప్టీన్త్‌ని నేడే చూసినట్టు ఉందిరో
దంచి దంచి ఉన్న రోలుకీ గ్యాపే చిక్కినట్టు ఉందిరో
వదిలేసి వైఫుని సరికొత్త లైఫునీ చూసీ ఎన్నాళ్లయ్యిందిరో
ఎప్పుడో ఎన్నడో ఎక్కడో తప్పినట్టి ఫ్రీడం చేతికందిందిరో
పుట్టెడు తట్టెడు కష్టమే తీరినట్టు స్వర్గమే సొంతమయ్యిందిరో..

రెచ్చిపోదాం బ్రదర్..
భార్య లేక మస్తుగుంది వెదర్
రెచ్చిపోదాం బ్రదర్..
భర్త లైఫు మళ్లీ బ్యాచిలర్

హల్లో అంటు గంటగంటకీ సెల్లే మోగు మాటిమాటికీ
నువ్వెక్కడున్నవంటు నీ పక్కనెవ్వరంటు చస్తాం వీళ్లకొచ్చె డౌటుకి 
కాసే చెప్పాలి లేటుకి కాళ్లే పట్టాలి నైటుకి
గుచ్చేటి చూపురో సెర్చింగు యాపురో పార్వర్డ్ మార్చాలి ఫోనుకి
లేజరు స్కానరు ఎక్స్‌రే 
ఒక్కటయ్యి ఆలిగా పుట్టినాది చూడరో
చీటికీ మాటికి సూటిగా 
అలుగుతారు అంతకన్న 
ఆయుధాలు వాడరో

రెచ్చిపోదాం బ్రదర్..
భార్య లేక మస్తుగుంది వెదర్
రెచ్చిపోదాం బ్రదర్..
భర్త లైఫు మళ్లీ బ్యాచిలర్
బై బై ఇంట్లో వంటకీ టేస్టే చూపుదాము నోటికీ
ఇల్లాలి తిట్లకీ హీటైన బుర్రకీ థాయ్ మసాజ్ చెయ్యి బాడికీ
ఆర్గ్యూ చేసి ఉన్న గొంతునీ పెగ్గే వేసి చల్లబడనీ
తేలేట్టు ఒళ్లునీ పేలేట్టు కళ్లనీ దేఖో కంటబడ్డ ఫిగరుని
క్లీనరు డ్రైవరు ఓనరు నీకు నువ్వే బండికే స్పీడునే పెంచరో
పెళ్లాము గొళ్లెము లేని ఓ దీవిలో కాలు మీద కాలువేసి బతకరో..

రెచ్చిపోదాం బ్రదర్..
భార్య లేక మస్తుగుంది వెదర్
రెచ్చిపోదాం బ్రదర్..
భర్త లైఫు మళ్లీ బ్యాచిలర్
Share This :sentiment_satisfied Emoticon