మందార మందార కరిగే తెల్లారేలా సాంగ్ లిరిక్స్ భాగమతి (2018) తెలుగు సినిమా


Album : Bhaagamathie

Starring: Unni Mukundan, Anushka
Music :Thaman Ss
Lyrics-Sreejo
Singers :Shreya Ghoshal 
Producer:Vamsi
Diredctor:G Ashok
Year: 2018


మందార  మందార 
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా

కళ్లారా కళ్లారా
చూస్తున్నా కళ్లారా
సరికొత్త  స్నేహం దారిచేరా
అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే
ఏదో ఆశలది బదులో
ఏమో అది తేలేనా
కుదురుగా ఉండే మదిలో
చిలిపిగా ఎగిరే ఎదలో
తెలియని భావం తెలిసే కథ మారేనా

ఒహ్హ్…
నీ వెంట  అడుగే వేస్తూ
నీ నీడనై గమనిస్తూ
నా నిన్నల్లో లేని  నన్నే ఇలాగ
నీలో చూస్తున్నా

మందార  మందార 
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా

కళ్లారా కళ్లారా
చూస్తున్నా కళ్లారా
సరికొత్త  స్నేహం దారిచేరా
సుందర… మందార… కళ్లారా… సుందర..

మందార  మందార 
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా

ఉనికిని చాటే ఊపిరి కూడా
ఉలికి పడేలా ఉందే ఇలా
కలలోనైనా కలగనలేదే
విడిపోతుందని అరమరికా…
కడలై నాలో నువ్వే
అలనై నీలో  నేనే
ఒకటై  ఒదిగే క్షణమే అది ప్రేమేనా
కాలాలనే మరిపిస్తూ
ఆనందమే అందిస్తూ
నా ప్రయాణమై నా గమ్యానివై
నా నువ్వవుతున్నావే

మందార  మందార 
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా

కళ్లారా కళ్లారా
చూస్తున్నా కళ్లారా
సరికొత్త  స్నేహం దారిచేరా

మందార  మందార 
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా

Share This :sentiment_satisfied Emoticon