Album : Mahanubhavudu
Starring: Sharwanand, Mehreen Kaur
Music :SS Thaman
Lyrics- Sirivennela Seetharama Sastry
Singers :Shweta Pandit
Producer:Vamsi, Pramod, SKN
Maruthi: Maruthi
Year: 2017
ఎపుడైనా నీ రూపం నువ్వు చూడాలంటే చెప్పమ్మా
అచ్చంగా ఇతగాడల్లే ఉంటుందమ్మా ఓ ప్రేమ
అన్నింటా నీ తీరే...అడుగడుగు నీ జోరే..
గుండెల్లో గోదారై పొంగే భావమా...
వెంటాడే పరిచయమో...వేటాడే పరిమళమే..
మౌనంతో మాటాడే మంత్రాల మరి మహిమో..
అరెరే ఎంత ప్రేమో...అది ఎం పిచ్చితనమో...
పేరైతే వేరైనా ఆ రెండు ఒక్కటేమో..
ఎపుడైనా నీ రూపం నువ్వు చూడాలంటే చెప్పమ్మా
అచ్చంగా ఇతగాడల్లే ఉంటుందమ్మా ఓ ప్రేమ
చినుకంతైనా చిరుచెమట .
చెమరిస్తుంటే నా నుదుట
సూర్యుడినే కసిరేస్తాడట..
పుప్పొడి పడినా నా పైన..
నా సుకుమారం కందునటా..
పూవులతో కలహిస్తాడట...
కలిసొచ్చిన తొలివరమో...
కనిపించని కలవరమో..
శృతి మించిన రాగం లో ఊహాగానమో...
తాను నా కంటి మెరుపో...కలిగే ఆదమరుపో..
తనకైనా తెలిసిన అదేంత కొంటే తనమో..
అరెరే ఎంత ప్రేమో...అది ఎం పిచ్చి తనమో ...
పేరైతే వేరైనా ఆ రెండు ఒక్కటేమో .
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon