బుగ్గంచున ఎరుపుని పెంచే సమయం ఇవ్వరా సాంగ్ లిరిక్స్ జావాన్ (2017) తెలుగు సినిమా

label

Album : Jawaan

Starring: Sai Dharam Tej, Mehreen Pirzada
Music :Thaman S
Lyrics-Srimani
Singers :Sri Krishna and Lipsika
Producer:Krishna under Arunachal Creations
Director:BVS Ravi

Year: 2017


బుగ్గంచున ఎరుపుని పెంచే  
సమయం ఇవ్వరా.....
రెప్ప అంచున కలలే పంచె 
సమయం అవ్వరా.....
బుగ్గంచున ఎరుపుని పెంచే  
సమయం ఇవ్వరా.....
రెప్ప అంచున కలలే పంచె 
సమయం అవ్వరా.....
మెడ అంచులలో ముద్దై 
జడ అంచులలో తడివై 
ఒడి అంచులలో తలవై 
సమయం ఇచ్చేయ్ రా

ఈ వీక్షణం నీరిక్షణం  
తీరుస్తూ ఉంటాను ప్రతిక్షణం 
కౌగిళ్లతో శిక్షించనా  అంటోంది ప్రేమాక్షరం
చీరంచు దూరమే చెరిపేయ్
నడుమంచు చేతికే ఇచ్చేయ్
పెదవంచు మంచునే పంచెయ్
అంచులు తెంచే.....
చీరంచు దూరమే చెరిపేయ్
నడుమంచు చేతికే ఇచ్చేయ్
పెదవంచు మంచునే పంచెయ్
అంచులు తెంచే.....

బుగ్గంచున ఎరుపుని పెంచే  
సమయం ఇవ్వరా.....
రెప్ప అంచున కలలే పంచె 
సమయం అవ్వరా.....

నారింజ రంగుల ఎండలో
సారంగీ తీగల సంధ్యలో
శృంగార పువ్వుల పూజకే
సమయం  ఇచ్చేయ్ రా
నా చేతి రాతల పంచన
కస్తూరి గీతల చెంతన
దస్తూరి లా మారేందుకే
సమయం ఇచ్చేయ్ రా
నీ సోయగం సోకె విషం 
బావుంది నాలోన ప్రవహించడం
నీ యవ్వనం యమపాశమే
అవుతుంటే ప్రాణోదయం 
వయసంచు వరదలో ముంచేయ్
చేమటంచు వేడినే పెంచేయ్
తనువంచు తనువుతో కంచె
అంచులు  తెంచేయ్.....
చీరంచు దూరమే చెరిపేయ్
నడుమంచు చేతికే ఇచ్చేయ్
పెదవంచు మంచునే పంచెయ్
అంచులు తెంచే.....

బుగ్గంచున ఎరుపుని పెంచే  
సమయం అవ్వరా.....
సమయం సమయం ఇచ్చేయ్ రా

Share This :
avatar


అంచుల, బుగ్గంచుల రె
ప్పంచుల, మెడయంచు, కౌగి లంచుల నడుమం
చంచుల చీరంచుల పెద
వంచుల తనువంచుల కనుపండువు రమణీ :)

జిలేబి

delete 2 November 2017 at 19:02
avatar
Aarde Lyrics person

ఈ సాంగ్ లిరిక్స్ చాల బావుంటాయి కదా అండి

delete 27 November 2017 at 05:08



sentiment_satisfied Emoticon