Album:Adapillanamma
Starring:N/A
Music :N/A
Lyrics-Madhu Priya
Singers :Madhu Priya
Producer:N/A
Director:N/A
Year:2011
ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానీ
బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా
ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానీ
బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా
ఈ పాడు లోకములో అమ్మా హీనంగా చూస్తున్నారా
ఆడది అంటున్నారా అమ్మ పాడదని అంటున్నారా
అష్టంగ పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నార
నన్నేమో పాడదని తిడుతున్నారా
ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానీ
బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా
పలకా బలపం బట్టీ అమ్మ బడికీ పోతుంటే
ఆడపిల్లైనందుకు అమ్మ చదువెందుకంటున్నారా
చదువెందుకంటున్నారా సంజెందుకంటున్నారా
చదువుల తల్లీ సరస్వతీ దేవీ ఆడద కాదమ్మ
నాకేమొ చదువెందుకంటున్నారా
ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానీ
బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా
ఎదిగేటి నన్ను చూసీ అమ్మ ఏడుస్తున్నావా
లక్షల కట్నాలూ అమ్మ ఎట్లా ఇస్తననీ
కడుపులోనె ఆడబిడ్డని అమ్మ కరగదీస్తున్నారా
ఆడ బిడ్డలను వద్దనుకొంటె సృష్టికి మూలమేది
రేపేమొ జగతికి మార్గమేది
ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానీ
బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా
బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా
comment 3 comments:
more_vertఅష్టమిలొ పుట్టాననీ అమ్మా జేష్టదని అంటున్నారు
ఆడదాని అంటున్నరా అమ్మా పాడుదని అంటున్నారా
అష్టమిలొ పుట్టిన కృష్ణుణ్ణేమో దేవుడిని అంటున్నరా
నన్నేమొ పాడుదని తిడుతున్నరా pl correct these lines Tq👍
CUTE
Yes this is real please dont hate girls

sentiment_satisfied Emoticon