Album mr nookayya
Starring: Manoj Manchu, Kriti Kharbanda, Sana Khan
Music : Yuvan Shankar Raja
Lyrics-Ramajogayya Shastry
Singers :Haricharan
Producer:D. S. Rao
Director: Ani Kanneganti
Year: 2011
ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు
మళ్లీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు
కష్టమనేది లేని రోజంటూ లేదు కదా
కన్నీరు దాటు కుంటూ సాగిపోగ తప్పదుగా
హో ఓ ఓ అమ్మ కడుపు వదిలిన అడుగడుగు
హో ఓ ఓ ఆనందం కోసమే ఈ పరుగు
హో ఓ ఓ కష్టాల బాటలో కడ వరకు
హో ఓ ఓ చిరునవ్వు వదలకు
నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలు
నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు
ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వేయగల వారెవరు
అందరికి చివరాకరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు
అవుతున్న మేలు కీడు అనుభావలేగా రెండు
దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా
తలో పాత్ర వేయకుంటే కాల యాత్ర కదిలేనా
హో ఓ ఓ నడి సంద్రమందు దిగి నిలిచాకా
హో ఓ ఓ ఎదురీద కుండ మునకేస్తావా
హో ఓ ఓ నిను నమ్ముకున్న నీ ప్రాణాన్ని
హో ఓ ఓ అద్దరికి చేర్చవా
పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే
బతుకు అనే మార్గములో తన తోడు ఎవరు నడవరులే
చీకటిలో నిసి రాతిరిలో నీ నీడ కూడా నిను వదులునులే
నీ వారు అను వారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలే
చితి వరకు నీతో నువ్వే
చివరంట నీతో నువ్వే
చుట్టూ ఉన్న లోకం అంత నీతో లేనే లేదనుకో
నీకన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో
హో ఓ ఓ లోకాన నమ్మకం లేదసలే
హో ఓ ఓ దాని పేరు మోసమై మారేనులే
హో ఓ ఓ వేరెవరి సాయమో ఎందుకులే
హో ఓ ఓ నిన్ను నువ్వు నమ్ముకో
comment 3 comments:
more_vertSuperbb Lyrics And Meaning Full Lyrics ossssmmmmm song ❤💔
My favorite lyrics
Most emotional connecting song
sentiment_satisfied Emoticon