అనగనగా కథలా ఆ నిన్నకు సాంగ్ లిరిక్స్

label


Album : Venky

Starring: RaviTeja, Sneha

Music : Devi Sri Prasad

Lyrics-Sahithi

Singers :Karthik and Sumangali

Producer:Atluri Purnachandra Rao

Director:  Srinu Vaitla, Gopimohan

Year: 2004


 హొయ్.. అనగనగా కథలా ఆ నిన్నకు సెలవిస్తే

అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే


లోకాల చీకటినీ.. తిడుతూనే ఉంటామా

ఓ చిన్న దీపాన్ని వెలిగించుకోలేమా

ఆ వెలుగులికి తొలి చిరునామా.. అది ఒకటే చిరునవ్వే నమ్మ...


అనగనగా కథలా ఆ నిన్నకు సెలవిస్తే

అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే..


హేల్లా.. హేలాల్లా.. జాబిలి కంట్లో కన్నీళ్లా

హేల్లా.. హేలాల్లా.. వెన్నెల కురవాలా



హొయ్.. బాధలో కన్నులే కందినంత మాత్రాన.. పోయిన కాలము పొందలేముగా

రేగిన గాయమే ఆరనంత మాత్రాన.. కాలమే సాగక ఆగిపోదుగా..


అరె ఈనేల ఆకాశం.. ఉందే మన కోసం

వందేళ్ళ సంతోషం అంతా మన సొంతం

ఈ సరదాలు, ఆనందాలు అలలయ్యేల అల్లరిచేద్దాం...


అనగనగా కథలా ఆ నిన్నకు సెలవిస్తే

అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే



ఎందుకో ఏమిటో ఎంతమందిలో వున్నా

నా ఎద నీ జతే కోరుతుందిగా


ఒంటరి దారిలో నాకు తోడువైనావు.. ఎన్నడు నీడగా వెంట ఉండవా


హేయ్... కలలే నిజమైనాయి కనులే ఒకటయ్యి

కలిపేస్తూ నీ చేయి అడుగే చిందెయ్యి

మన స్నేహాలు సావాసాలు కలకాలాలకు కథ కావాలి

Share This :



sentiment_satisfied Emoticon