ప్రేమ స్నేహాన్ని అడిగింది..

ప్రేమ స్నేహాన్ని అడిగింది.. 
నేనున్న ప్రతీ చోట 
నువ్వెందుకు ఉండవని. 
అప్పుడు స్నేహం 
ప్రేమతో ఇలా అంది.. 


కొన్నిసార్లు నువ్వు హృదయాలను గాయపరిచి 
కన్నీరు మిగిల్చి వెళ్ళిపోతావు
చీకటిలో ఒంటరిని చేసి మాయమైపోతావు 


కానీ అలాంటప్పుడే నేను 
ఆ చీకటిలో వెలుగులను 
గాయపడిన హృదయాలకు
ఓదార్పును చిరునవ్వును 
కలిగిస్తాను అని

- రామ్ పోతురాజు 


Share This :



sentiment_satisfied Emoticon