చల్ల గాలి తాకుతున్న (తీరం తెలిసాకా) సాంగ్ లిరిక్స్ ఎవడే సుబ్రహ్మణ్యం (2015) తెలుగు సినిమా

 చిత్రం : ఎవడే సుబ్రహ్మణ్యం   

సాహిత్యం  :  అనంత శ్రీరామ్  

సంగీతం : ఇళయరాజా   

గానం  :  రక్షిత సురేష్ & సెంథిల్  



చల్ల  గాలి  తాకుతున్న 

మేఘమైనదీ  మనసిలా 

నేలకేసి  జారుతున్న 

జల్లు  అయినదీ వయసిలా 

ఎందుకంట  ఇంత దగా 

నిన్న  మొన్నా .. లేదు  కదా 

ఉండి ఉండి నెమ్మదిగా 

నన్ను  ఏటో  లాగుతుందా 

తప్పదని  తప్పించుకోలేనని 

తోచెట్టు  చేస్తున్నదా




చల్ల  గాలి  తాకుతున్న 

మేఘమైనదీ  మనసిలా 

నేలకేసి  జారుతున్న 

జల్లు  అయినదీ వయసిలా



ఎవరో  అన్నారని .. మారావే .. నాలో  ఆశలూ 

ఎవరేమన్నారనీ .. పొంగేనే .. ఏవో  ఊహలూ 

ఎవరో  అన్నారని .. మారావే .. నాలో  ఆశలూ 

ఎవరేమన్నారనీ .. పొంగేనే .. ఏవో  ఊహలూ 

తీరం  తెలిసాకా  ఇంకో   దారిని  మార్చనా  

దారులు  సరి  అయినా .. వేరే  తీరం  చేరేనా 

నడకలు  నావేనా .. నడిచేది .. నేనేనా 


చల్ల  గాలి  తాకుతున్న 

మేఘమైనదీ  మనసిలా 

నేలకేసి  జారుతున్న 

జల్లు  అయినదీ వయసిలా


ఎంతగా  వద్దంటున్నా .. ఆగదు  ఆత్రం  ఏమిటో 

ఇంతగా  పొంగెతా .. అవసరం .. ఏమో .. ఎందుకో 

అయినా  ఏమయినా  ఎద  నా  చేయిజారిందే 

ఎపుడో  ఏనాడో  ప్రేమే  నేరం  కాదంది

చెలిమె .. ఇంకోలా .. చిగురిస్తూ .. ఉందటే 


చల్ల  గాలి  తాకుతున్న 

మేఘమైనదీ  మనసిలా 

నేలకేసి  జారుతున్న 

జల్లు  అయినదీ వయసిలా



Share This :



sentiment_satisfied Emoticon