Album: Suprabhatham
Starring: Srikanth,Rasi
Music : V. Srinivas
Lyrics-Shanmuka sharma
Singers : Sp Balu, Chithra
Year:1998
ఓ ప్రియా వసుంధర ప్రియా ప్రియా
ప్రే మనే వరించి రా ప్రియా ప్రియా
ఓ ప్రియా మనోహర ప్రియా ప్రియా
స్వా గతం స్వయంవరా ప్రియా ప్రియా
మనిషి కన్న ముందర, మనసు చేసె తొందర
కనుల గడప దాటుతూ, స్వప్నమెదుట పడెనురా
కలలలోని కలికి తార చిలుకుతోంది కాంతిధార
ఓ ప్రియా వసుంధరా ప్రియా ప్రియా
ఓ ప్రియా మనోహరా ప్రియా ప్రియా
అరవిరిసిన కన్నులే మీటుతున్నవి
అరమరికలు వద్దనీ చాటుతున్నవి
.
తెరమరుగులు ఇప్పుడే తొలగుతున్నవి
మన మనసుకు రెక్కలే తొడుగుతున్నవి
నా మిణుకు మిణుకు ఆశలే నిజమయ్యేలా
నీ వెలుగు తగిలి లోకమే మారే ఈ వేళ
నీ చిలిపి కనుల గూటిలో నేనే ఉండేలా
నా బ్రతుకు జతగ చేయగా వచ్చా గోపాలా
కౌగిళ్ళ సంకెళ్లు వేయనా
నిన్ను శృంగార ఖైదీగ చేయనా
ఈ శిక్ష చాలంటు చాటనా
ఒప్పుకుంటాను ఈ తీపి దండన
అలక తీరి అసలు దారి తెలిసి నడిచె రాకుమారి
ఓ ప్రియా మనోహర ప్రియా ప్రియా
ప్రే మనే వరించి రా ప్రియా ప్రియా
రెపరెపమని రెప్పలే విప్పుకున్నవి
తపనల యెద తాళమే తప్పుతున్నదీ
ఎపుడెపుడని ఆత్రమే అడుగుతున్నది
అపుడిపుడని వాయిదా వేయనన్నది
నా దురుకు దొరుకుతున్నదీ నాలో సింగారం
ఇక తరిగి కరుగుతున్నదీ ఇన్నాళ్ల దూరం
ఈ కలికి కులుకు కదలికే కన్యాకుమారం
నా ఉడుకుదుడుకు గుండెలో మోగే అలారం
కృష్ణయ్య తీరున్న రాముడే
సిగ్గు విల్లెక్కు పెట్టాడు వీరుడే
కాలాలు కనిపెట్టి కాముడే
తన కనికట్టు చూపాడు ధీరుడే
ముంచుతున్న మంచు కరిగి
పొద్దుపొడుపు వెలుగు కాంతి
ఓ ప్రియా వసుంధర ప్రియా ప్రియా
ప్రే మనే వరించి రా ప్రియా ప్రియా
ఓ ప్రియా మనోహర ప్రియా ప్రియా
స్వా గతం స్వయంవరా ప్రియా ప్రియా
మనిషి కన్న ముందర, మనసు చేసె తొందర
కనుల గడప దాటుతూ, స్వప్నమెదుట పడెనురా
కలలలోని కలికి తార చిలుకుతోంది కాంతిధార
ఓ ప్రియా వసుంధరా ప్రియా ప్రియా
స్వా గతం స్వయంవరా ప్రియా ప్రియా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon