నా ప్రాణమా నన్ను వీడిపోకు మా సాంగ్ లిరిక్స్




పాట : అనిత ఓ అనిత

సంగీతం: రవి కళ్యాణ్ 

సాహిత్యం: గునిపర్తి నాగరాజ్ 

గానం: గునిపర్తి నాగరాజ్ 

నటినటులు: ఎమ్మిగనూరు కోటేంద్ర, సుగుణ 

కొరియోగ్రఫీ: ఎమ్మిగనూరు కోటేంద్ర


 నా ప్రాణమా నన్ను వీడిపోకు మా!

నీ ప్రేమలో నన్ను కరగనీకు మా!

పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది

వద్ధన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది

అనితా..అనితా ఆ ఆ... అనితా ఓ వనితా నా అందమైన అనితా,

దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమపైనా..


నా ప్రాణమా నన్ను వీడిపోకుమా

నీ ప్రేమలో నన్ను కరగనీకు మా..

ఓ ఓ ఓహ్.. ఓ ఓ ఓ ఓహ్!!!


నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా,

నీ ప్రేమ అనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా

కలలొ కూడ నీ రూపం నన్ను కలవరపరిచెనె

కనుపాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే

నువ్వు ఒక్క చోటా... నేనొక చోటా....

నిన్ను చూడకుండ నే క్షణం ఉండలేనుగా...,

నా పాటకి ప్రాణం నీవే, నా రేపటి స్వప్నం నీవే,

నా ఆశల రాణివి నీవే, నా గుండెకి గాయం చేయకే....అనితా..

అనితా ఆ అనితా ఓ వనితా నా అందమైన అనితా,

దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా..


నా ప్రాణమా నన్ను వీడిపోకుమా

నీ ప్రేమలో నన్ను కరగనీకు మా..


నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచా,

ప్రతి క్షణమూ ధ్యానిస్తూ పసి పాపల చూస్తా,

విసుగు రాని నా హృదయం నీ పిలుపుకై ఎదురు చూసె,

నిన్ను పొందని ఈ జన్మే నాకెందుకని అంటుందే,

కరుణిస్తావో.. కాటేస్తావో.. నువ్వు కాదని అంటే నే శిలనవుతానే

నన్ను వీడని నీడవి నీవే, ప్రతి జన్మకు తోడువు నీవే

నా కమ్మని కల్లలు కూల్చి నన్ను ఒంటరి వాడ్ని చేయకే

ఎహ్..అనితా.. అనిత ఆ.. అనితా ఓ వనితా నా అందమైన అనితా

దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా


నా ప్రాణమా నన్ను వీడిపోకుమా

నీ ప్రేమలో నన్ను కరగనీకు మా..

పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది

వద్ధన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది

అనిత..అనిత ఆ ఆ అనిత ఓ వనిత నా అందమైన అనిత,

దయ లేదా కాస్తైనా నా పేద ప్రేమపైన


ఏదో రోజు నా పై నీ ప్రేమ కలుగుతుందని

ఒక చిన్ని ఆశ నాలో చచ్చేంత ప్రేమ మదిలో

ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా

ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా

ఒట్టేసి చెపుతున్నా నా ఊపిరి ఆగువరకు

నిను ప్రేమిస్తూనే ఉంటా అనితా అనితా

అనిత అనిత అనిత ఓ వనితా నా అందమైన అనితా

దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైనా


Share This :



sentiment_satisfied Emoticon