నా ప్రాణమా సుస్వాగతం సాంగ్ లిరిక్స్ డాడీ (2001) తెలుగు సినిమా


Album:Daddy

Starring:Chiranjeevi, Simran Bagga
Music :S A Rajkumar
Singers :Udit Narayan, Chitra
Producer:Allu Aravind
Director:Suresh Krishna
Year: 2001






గరిగపరిసా గరిగమప
గరిగపరిసా గరిగమప

నా ప్రాణమా సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
అనురాగమా అభినందనం
అనుబంధమా శుభవందనం

నీకోసమే పుట్టానని
నా ఊపిరన్నది
ఏనాటికి విడిపోనని
చెప్పాలనున్నది

మరొక్కమారను ఆ మాటే
మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే
స్మరిస్తు ఉంటుంది

గరిగపరిసా గరిగమప
గరిగపరిసా గరిగమప

నడి రేయే నిలవదుగా వెన్నెలగా
నువ్వు నవ్వుతుంటే
ఈ హాయే చెదరదుగా నా జతగా
నువ్వు చెంతనుంటే

చలి కాలం రాదుగా
వెచ్చనైన కౌగిలికి
చిగురెపుడు రాలదుగా
పచ్చనైన ఆశలకి

ప్రేమే పందిరై
బ్రతుకే విరబూసే వేళా

మరొక్కమారను ఆ మాటే
మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే
స్మరిస్తు ఉంటుంది

గరిగపరిసా గరిగమప
గరిగపరిసా గరిగమప

హా నా ప్రాణమా సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం

షాలలు షాలలు షాలలు షాలలు
షాలలు షాలలు షాలలు షాలలు

ఎడబాటే వంతెనగా నడిపెనుగా
నిన్ను చేరుకోగా
తడబాటే నర్తనగా నీ నడక
నన్ను వెతికి రాదా

సంకోచం తీర్చగా
ముగ్ధ బాస చేస్తున్నా
సంతోషం సాక్షిగా
మూగ భాష వింటున్నా

నీలో లీనమై నేనే
నీవనిపించేలా

మరొక్కమారను ఆ మాటే
మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే
స్మరిస్తు ఉంటుంది

నా ప్రాణమా సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం

నీకోసమే పుట్టానని
నా ఊపిరన్నది
ఏనాటికి విడిపోనని
చెప్పాలనున్నది

మరొక్కమారను ఆ మాటే
మనస్సు వింటుంది
పదే పదే ఎద నీ మాటే
స్మరిస్తు ఉంటుంది

గరిగపరిసా గరిగమప
గరిగపరిసా గరిగమప




Share This :



sentiment_satisfied Emoticon