Album :Sri Anjaneyam
Starring:Nithiin, Arjun, Charmy Kaur
Music Manisharama
Lyrics-Sirivennela Sitarama sastry
Singers :Shreya Ghoshal
Producer: Krishna Vamsi
Director:Krishna Vamsi
Year: 2004
పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా
ప్రేమంటే పామని బెదరాలా
ధీమాగా తిరగరా మగరాయడా
భామంటే చూడని వ్రతమేలా
పంతాలే చాలురా ప్రవరాఖ్యుడా
మారనే మారవా మారవేం మానవా..
మౌనివా మానువా తేల్చుకో మానవా
పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా
చెలి తీగకి ఆధారమై బంధమై అల్లుకో
దరికొచ్చి అరవిచ్చి అరవిందమయ్యే అందమే అందుకో
మునిపంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో
నా వాలు జడ చుట్టుకొని వదిలి లేక నడుము నడిపించుకో
వయసులో పరవశం చూపుగా చేసుకో
సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో
పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా
ప్రతి ముద్దుతో ఉదయించని కొత్త పున్నాగనై
జతలీలలో అలసి మత్తెక్కిపోని నిద్ర గన్నేరునై
నీ గుండె పై ఒదిగుండని పొగడ పూదండనై
నీ కంటి కోనేట కొలువుండిపోనీ చెలిమి చెంగలువనై
మోజులే జాజులే పూయని హాయిని
తాపమే తుమ్మెదై తియ్యని తేనెని
పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon