పాట: మోసమే చేయకే ప్రేమా
సంగీతం: మదీన్ SK
సాహిత్యం: నవ సందీప్
గానం: నవ సందీప్
ఆర్టిస్ట్స్: ప్రేమలత, నవ సందీప్
దర్శకత్వం: రాజ్ నరేంద్ర
ప్రొడ్యూసర్: జ్యోతి కున్నూరు
మ్యూజిక్ లేబుల్: నివ్రితి వైబ్స్
ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా మాయలమారీ బొమ్మా
నువ్వు గారడి చెయ్యకె కొమ్మా నన్ను ఆడించమాకే అమ్మా
గుండెల్లొ తన్నావు నొప్పిలేదె నా సొమ్మంత తిన్నావు బాధలేదే
మనసుని కాల్చావె మంటలేదె నాపరువంత తీసావు మరపురాదే
ఎన్ని చేసినా ఎమి జరిగినా నీపై ఆశ చావదే
మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ద్రోహమే చేయొద్దమ్మా
మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ప్రాణమే తీయొద్దమ్మా
ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా మాయలమారీ బొమ్మా
నువ్వు గారడి చెయ్యకె కొమ్మా నన్ను ఆడించమాకే అమ్మా
ఊరిలో గాలికే తిరిగేటి నన్నే
సక్కనీ దారిలో నడిపించినావే
మొద్దుగా మొరటుగా ఉండేటి నాకే
స్టైలుగా బ్రతకడం నేర్పించినావే
నాపసిడి పాలపిట్టా బంగారు పూలబుట్టా
నన్నొదిలిపోతె ఎట్టా నామీద నీకు బెట్టా
నాజింక పూల చెట్టా సొగసైన సిరులగుట్టా
నువువె ల్లిపోతె ఎట్టా నేనుండలేను ఇట్టా
తిట్టినా కొట్టినా సర్దుకుపోతానే
ఇల ఒంటరిగా ఒదిలేస్తే తట్టుకోలేనే
మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ద్రోహమే చేయొద్దమ్మా
మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ప్రాణమే తీయొద్దమ్మా
ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా మాయలమారీ బొమ్మా
నువ్వు గారడి చెయ్యకె కొమ్మా నన్ను ఆడించమాకే అమ్మా
అనాదగా ఉన్న నన్ను ఆదరించినావే
ఆలనా పాలనా చూసుకున్నావే
ముందు వెనక ఎవరు లేని ఏకాకి నేను
తల్లిలా నీఒడిలో జోలపాడినావే
నువు రావన్న మాటా అది అగ్నిశకలకూట
నిను పొందలేని చోట ఆగిపోదా నాపాట
నే కలలు కన్న కోట కూల్చేస్తివె ఈపూట
ఇది బొమ్మ బొరుసు ఆట అనుకుంటివె నా తాతా
సచ్చినా బతికినా నీతో ఉంటానే
నువు లేకుంటే ఈ క్షణమే సచ్చిపోతానే
మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ద్రోహమే చేయొద్దమ్మా
మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ప్రాణమే తీయొద్దమ్మా
ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా మాయలమారీ బొమ్మా
నువ్వు గారడి చెయ్యకె కొమ్మా నన్ను ఆడించమాకే అమ్మా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon