ఏమే పిల్ల అంటాటే సాంగ్ లిరిక్స్

label

పాట: ఏమే పిల్ల అంటాటే 
సంగీతం: మదీన్ SK
సాహిత్యం: మానుకోట ప్రసాద్ 
గానం: శ్రీలత యాదవ్
ఆర్టిస్ట్స్: భాను శ్రీ 
కోరియోగ్రాఫర్: రఘు మాస్టర్ 
ప్రొడ్యూసర్: జ్యోతి కున్నూరు

ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో ఐతాందే
నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నాదే

సెయ్యి పట్టుకొని సెరదీస్తే సిగ్గుపుట్టుకొచ్చే సెంపలోన
సీరకొంగు వట్టి ఇడవకుంటే గాలికావరయే గుండెలోన
బొట్టుపెట్టుకున్న ఓరిదేవ ఎండికొండలాంటి పోరాడేరా
కట్టుకుంటేగాని కట్నమియ్యా కంటిపాపాలెక్క సూసుకుంటా

ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో ఐతాందే
నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నాదే

గుట్ట గుట్ట గుండెదరువు తిండీతిప్పలే నాకు బరువు
ఎండ వానలు మారిపాయే సల్లని సలిలో సేమాటలాయె

వాని మటలింటే మాయాజాలం మత్తులోకి జారుకుంటా గోలం
వాని నవ్వు సూస్తేనే లేనిరోగం వెయ్యిజన్మలైన పోదుభందం
ఒట్టు వెట్టుకున్న ఓరిదేవ ఎండికొండలాంటి పోరాడేర
కట్టుకుంటేగాని కట్నమియ్యా కంటిపాపాలెక్క సూసుకుంటా

ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో ఐతాందే
నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నాదే

కట్టమీద కాలినడకన నెత్తిమీదనే ఎండ మోత
సూపుకు నచ్చినపోరాడీడు సూసిగూడ సుడనట్టు సూడు

గుంజుకొని జర్రనీడనిస్తే కాదంట అన్నాసెప్పునువ్వు
ఎండతాపానికి దాహమిస్తే వద్దంట అన్నాసెప్పునువ్వు
వోట్టువెట్టుకున్న ఓరిదేవ ఎండికొండలాంటి పోరాడేర
కట్టుకుంటేగాని కట్నమియ్యా కంటిపాపాలెక్క సూసుకుంటా

ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో ఐతాందే
నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నాదే

కచ్చెగట్టి సెయ్యిమీద పచ్చబొట్టునే నే ఏసుకున్న
కట్టే వట్టుకొని దారిలో వానికోసమే కాసుకున్న

వాడులేకుండా నా రతం ఆరువాలు శాతం మురువాలు
వాడు ఎదురుగాఉంటే అమ్మతోడు మాటన్నరాదు ఏమిగోరం
వోట్టువెట్టుకున్న... 
వొట్టు వోట్టువెట్టుకున్న ఓరిదేవ ఎండికొండలాంటి పోరాడెర
కట్టుకుంటేగాని కట్నమియ్యా కంటిపాపాలెక్క సూసుకుంటా
వొట్టు వోట్టువెట్టుకున్న ఓరిదేవ ఎండికొండలాంటి పోరాడెర
కట్టుకుంటేగాని కట్నమియ్యా కంటిపాపాలెక్క సూసుకుంటా

ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో ఐతాందే
నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నాదే

Share This :

sentiment_satisfied Emoticon