- అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
- అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
- అతి రహస్యం బట్టబయలు
- అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
- అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
- అనువు గాని చోట అధికులమనరాదు
- అభ్యాసం కూసు విద్య
- అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
- అయితే ఆదివారం కాకుంటే సోమవారం
- ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
- ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
- ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
- ఇంట గెలిచి రచ్చ గెలువు
- ఇల్లు పీకి పందిరేసినట్టు
- ఎనుబోతు మీద వాన కురిసినట్టు
- చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
- కందకు లేని దురద కత్తిపీటకెందుకు
- కత్తిపోటు తప్పినాక కలంపోటు తప్పదు
- కుక్క కాటుకు చెప్పుదెబ్బ
- కోటి విద్యలు కూటి కొరకే
- నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
- పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
- పిట్ట కొంచెము కూత ఘనము
- రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
- వాన రాకడ ప్రాణపోకడ
- కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
- మీసాలకు సంపంగి నూనె
- ఆ మొద్దు లొదే ఈ పేడు
- ఆ తాను ముక్కే !!!
- ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
- ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
- ఆది లొనే హంస పాదు
- ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
- ఆకలి రుచి యెరుగదు, నిద్ర సుఖమెరుగదు
- ఆకాశానికి హద్దే లేదు
- ఆలస్యం అమృతం విషం
- ఆరే దీపానికి వెలుగు యెక్కువ
- ఆరోగ్యమే మహాభాగ్యము
- ఆత్రానికి బుద్ధి మట్టు
- ఆవులింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడంట
- ఆవు చేను మేస్తే, దూడ గట్టు మేస్తుందా?
- అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
- అడగందే అమ్మైనా అన్నమ్ పెట్టదు
- అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు కాదు
- ఏ ఎండకు ఆ గొడుగు
- అగడ్తలొ పడ్డ పిల్లికి అదే వైకున్ఠం
- అగ్నికి వాయువు తొడైనట్లు
- ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమనేవాడు
- అందని మ్రానిపండ్లకు అర్రులు చాచుట
- అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
- అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
- అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేధు
- అప్పు చేసి పప్పు కూడు
- అయ్య వచే వరకు అమావాస్య ఆగుతుందా
- అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
- బతికుంటే బలుసాకు తినవచ్చు
- బెల్లం కొట్టిన రాయిలా
- భక్తి లేని పూజ పత్రి చేటు
- బూడిదలో పోసిన పన్నీరు
- చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే యేడుస్తాడు
- చాప కింద నీరులా
- చచ్చినవాని కండ్లు చారెడు
- చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
- విద్య లేని వాడు వింత పశువు
- చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
- చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
- చక్కనమ్మ చిక్కినా అందమే
- చెడపకురా చెడేవు
- చీకటి కొన్నాళ్ళు, వెలుగు కొన్నాళ్ళు
- చెరువుకి నీటి ఆశ, నీటికి చెరువు ఆశ
- చింత చచ్చినా పులుపు చావ లేదు
- చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే, ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట
- చిలికి చిలికి గాలివాన అయినట్లు
- డబ్బుకు లోకం దాసోహం
- దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
- దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
- దాసుని తప్పు దండంతో సరి
- దెయ్యాలు వేదాలు పలికినట్లు
- దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
- దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
- దొంగకు తేలు కుట్టినట్లు
- దూరపు కొండలు నునుపు
- దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
- దురాశ దుఃఖమునకు చెటు
- ఈతకు మించిన లోతే లేదు
- ఎవరికి వారే యమునా తీరే
- ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
- గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
- గాజుల బేరం భోజనానికి సరి
- గంతకు తగ్గ బొంత
- గతి లేనమ్మకు గంజే పానకము
- గోరు చుట్టు మీద రోకలి పోటు
- గొంతెమ్మ కోరికలు
- గుడ్డి కన్నా మెల్ల మేలు
- గుడ్డి యెద్దు జొన్న చేలో పడినట్లు
- గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
- గుడి మింగే వాడికి నంది పిండీమిరియం
- గుడినీ గుడిలో లింగాన్నీ మింగినట్లు
- గుడ్ల మీద కోడిపెట్ట వలే
- గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
- గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
- గురువుకు పంగనామాలు పెట్టినట్లు
- తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
- ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
- ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
- ఇంటికన్న గుడి పదిలం
- ఇసుక తక్కెడ పేడ తక్కెడ
- జోగి జోగి రాజుకుంటే బూడిద రాలిందంట
- కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
- కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
- కాకి ముక్కుకు దొండ పండు
- కాకి పిల్ల కాకికి ముద్దు
- కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
- కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
- కాసుంటే మార్గముంటుంది
- కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
- కలకాలపు దొంగ ఒకనాడు దొరుకును
- కలిమి లేములు కావడి కుండలు
- కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుదతాదు
- కంచే చేను మేసినట్లు
- కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా!
- కందకు కత్తి పీట లోకువ
- కందెన వేయని బండికి కావలసినంత సంగీతం
- కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
- కీడెంచి మేలెంచమన్నారు
- కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
- కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు
- కొండను తవ్వి యెలుకను పట్టినట్లు
- కొన్న దగ్గిర కొసరు గాని కోరిన దగ్గర కొసరా
- కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట
- కూటికి పేదైతే కులానికి పేదా
- కొరివితో తల గోక్కున్నట్లు
- కోతి పుండు బ్రహ్మాండం
- కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
- కొత్తొక వింత పాతొక రోత
- కోతి విద్యలు కూటి కొరకే
- కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట
- కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
- కృషితో నాస్తి దుర్భిక్షం
- క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము
- కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
- కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
- లేని దాత కంటే ఉన్న లోభి నయం
- లోగుట్టు పెరుమాళ్ళకెరుక
- మెరిసేదంతా బంగారం కాదు
- మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
- నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
- మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
- మనిషి మర్మము మాను చేవ బయటకు తెలియవు
- మనిషి పేద అయితే మాటకు పేదా
- మనిషికి మాటే అలంకారం
- మనిషికొక మాట పశువుకొక దెబ్బ
- మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు
- మంత్రాలకు చింతకాయలు రాల్తాయా
- మీ బోడి సంపాదనకు ఇద్దరు పెళ్ళాలా
- మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
- మొక్కై వంగనిది మానై వంగునా
- మొరిగే కుక్క కరవదు
- మొసేవానికి తెలుసు కావడి బరువు
- ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి
- ముండా కాదు ముత్తైదువా కాదు
- ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
- ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి
- ముంజేతి కంకణముకు అద్దము యెందుకు
- నడమంత్రపు సిరి నరాల మీద పుండు
- నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
- నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
- నవ్వు నాలుగు విధాలా చేటు
- నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు
- నిదానమే ప్రధానము
- నిజం నిప్పు లాంటిది
- నిమ్మకు నీరెత్తినట్లు
- నిండు కుండ తొణకదు
- నిప్పు ముట్టనిది చేయి కాలదు
- నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు
- నూరు గుర్రాలకు అధికారి ఐనా భార్యకు యెండు పూరి
- నెల్లాళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు
- ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
- ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు
- బతికి ఉంటే బలుసాకు తినవచ్చు
- ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు
- ఊరు మొహం గోడలు చెపుతాయి
- పాకి దానితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
- పాము కాళ్ళు పామునకెరుక
- పానకంలో పుడక
- పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
- పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనపడినట్లు
- పండిత పుత్రః శుంఠ
- పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
- పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
- పట్టి పట్టి పంగనామం పెడితే గోడ చాటుకు వెళ్ళి చెరిపి వేసుకున్నాడట
- పెదిమ దాటితే పృథివి దాటును
- పెళ్ళంటే నూరేళ్ళ పంట
- పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
- పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట
- పెరుగు తోట కూరలో పెరుగు యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
- పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు
- పిచ్చోడి చేతిలో రాయిలా
- పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా
- పిల్లికి చెలగాటం యెలుకకు ప్రాణ సంకటం
- పిండి కొద్దీ రొట్టె
- పిట్ట కొంచెము కూత ఘనము
- పోరు నష్టము పొందు లాభము
- పోరాని చోట్లకు పోతే రారాని మాటలు రాకపోవు
- పొర్లించి పొర్లించి కొట్టిన మీసాలకు మన్ను కాలేదన్నదట
- పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
- పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
- రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
- రామాయణంలో పిడకల వేట
- రమాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు
- రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
- రెడ్డి వచ్చే మొదలు పెట్టు అన్నట్టు
- రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
- రౌతు కొద్దీ గుర్రము
- ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
- చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
- సంతొషమే సగం బలం
- సిగ్గు విడిస్తే శ్రీరంగమే
- సింగడు అద్దంకి పోనూ పొయ్యాడు రానూ వచ్చాడు
- శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు
- శుభం పలకరా యెంకన్నా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ అన్నాడంట!
- శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది
- తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందట
- తాడి తన్ను వాని తల తన్నేవాడు ఉంటాడు
- తాళిబొట్టు బలం వల్ల తలంబ్రాల వరకు బతికాడు
- తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు
- తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా
- తాతకు దగ్గులు నేర్పినట్టు
- తేలుకు పెత్తనమిస్తే తెల్లవార్లూ కుట్టిందట
- తన కోపమే తన శత్రువు
- తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము
- తంతే గారెల బుట్టలో పడ్డట్లు
- తప్పులు వెదికే వాడు తండ్రి ఒప్పులు వెదికేవాడు వోర్వలేనివాడు
- తీగ లాగితే డొంక అంతా కదిలినట్లు
- తెగేదాక లాగవద్దు
- తిక్కలోడు తిరణాళ్ళకు వెలితే ఎక్కా దిగా సరిపొయిందంట
- తినే ముందు రుచి అడుగకు వినే ముందు కథ అడుగకు
- తినగా తినగా గారెలు చేదు
- తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి
- తియ్యటి తేనె నిండిన నోటితోనే తేనెటీగ కుట్టేది
- ఉల్లి చేసిన మేలు తల్లి కూడ చేయదు
- ఉపకారానికి పోతే అపకారమెదురైనట్లు
- ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్టు
- ఉత్తికెక్కలేనమ్మ స్వర్గానికెక్కినట్టు
- వాపును చూసి బలము అనుకున్నాడట
- వీపుమీద కొట్టవచ్చు కాని కడుపు మీద కొట్టరాదు
- వెర్రి వెయ్యి విధాలు
- వినాశకాలే విపరీత బుద్ధి
- యే ఎండకు ఆ గొడుగు
- యే గాలికి ఆ చాప
- యెద్దు పుండు కాకికి ముద్దు
- యేకులు పెడితే బుట్టలు చిరుగునా
- యెక్కడైనా బావ కానీ వంగ తోట దగ్గర మాత్రం కాదు
- యెప్పుడూ ఆడంబరంగా పలికే వాడు అల్పుడు
తెలుగు సామెతలు
Share This :
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon