పట్టా పక్కింటి నాటు కోడి పెట్టనీ సాంగ్ లిరిక్స్

 


Album:Daddy


Starring:Chiranjeevi, Simran Bagga
Music :S A Rajkumar
Lyrics-Bhuvana Chandra
Singers :Udit Narayan, Chitra
Producer:Allu Aravind
Director:Suresh Krishna
Year: 2001

English Script Lyrics




పట్టా పక్కింటి నాటు కోడి పెట్టనీ

పెడతా ఎంచక్క ఘాటు ప్రేమ బువ్వనీ

పట్టా పక్కింటి నాటు కోడి పెట్టనీ

పెడతా ఎంచక్క ఘాటు ప్రేమ బువ్వనీ


అదిగో చూస్తుంది నిప్పురవ్వా

ఐన మోగించు ముద్దు మువ్వా

సిగ్గే లేదమ్మ హవ్వా హవ్వా

అమ్మో ఈ పిచ్చి పేరే లవ్వా


గురిబింధకి తన కిందనే

మచ్చోటి ఉన్నదని తెలువదా చెలి

తన సంగతి మనకెందుకోయ్

కమ్మంగ కానుకిస్తా కన్నె కౌగిలి


రావే నా మల్లెపూల తట్టా

పెట్టేయ్ ఎంచక్క తేనె రొట్ట

సిగ్గే లేదమ్మ హవ్వా హవ్వా

అమ్మో ఈ పిచ్చి పేరే లవ్వా


ప్రేమించానని మత్తుగా

పిచ్చెక్కించే వారిని

నమ్మొద్దంటే వెక్కిరించుట

న్యాయమా న్యాయమా


నువ్వొద్దన్నా మనిషిని

నే ప్రేమిస్తే తగదని

నీతులు చెప్పే నిన్ను మాత్రం

నమ్మటం సులభమా


కాకికి కోయిల పాట నచ్చునా

కప్పకి పువ్వుల విలువ తెలియునా

లోకుల మాటలు పక్కనెట్టవే

కమ్మని ముద్దుల విందు చేయవే


అసూయకి లొంగని ఆడదేది ఈ జగాన


రవ్వా రగిలింది తీపి తిక్క

వేయనా వెన్నెల్లో పూల పక్కా


రావే నా పాలకొల్లు ముంత మామిడి

చేస్తా సమ్మోహనంగా సోకు ముట్టడి


సిగ్గే లేదమ్మ హవ్వా హవ్వా

అమ్మో ఈ పిచ్చి పేరే లవ్వా


రగిలే మనసు రగలని

పగిలే గుండెలు పగలని

క్షణమైన నిను వదలలేనోయి

ప్రియతమా ప్రియతమా


విరిసే మొగ్గ ఉండగా

విచ్చిన పువ్వు ఎందుకే

పాలు నీరై కలిసి పోదాం

ప్రాణమా ప్రాణమా


మంచని చెబితే నెత్తికెక్కునా

గుండెలు పగలక బుద్ధి వచ్చునా


వచ్చే వెన్నెల రాక మానదే

పోయే చీకటి పోక మానదే


ఏనాటికి మరదు మారదే బ్రహ్మ రాత


సిగ్గే లేదమ్మ హవ్వా హవ్వా

అమ్మో ఈ పిచ్చి పేరే లవ్వా


అమ్మో నేనాగలేను సుందరాంగుడా

కొట్టేయ్ లవ్ స్టాంపు మీద ముద్దు ముద్దరా

రావే నా సీమ రేగు పండా

ఉంటా లైఫ్ అంత నీకు అండా


అదిగో చూస్తోంది రాతి బండ

వేసేయ్ నా మెళ్ళో పూల దండా


నీ టేస్టుకి నా టేస్టుకి

కుదిరిందే గొప్ప మ్యాచ్ కన్నె కోమలి

లోకానికి తెలియాలిగా

కొట్టేయ్ నా సామిరంగ కుర్ర కౌగిలి


రావే నా గండిపేట గువ్వా

పెడతా ఎంచక్క ప్రేమ బువ్వా

సిగ్గే లేదమ్మ హవ్వా హవ్వా

అమ్మో ఈ పిచ్చి పేరే లవ్వా

Share This :



sentiment_satisfied Emoticon