నేలమీద జాబిలీ సాంగ్ లిరిక్స్ మనసులో మాట (1999) తెలుగు సినిమా

 


 Album : Manasulo Maata


Lyrics-veturi
Singers :Udit Narayan
Producer: P. Usha Rani

Year: 1999
Telugu Script Lyrics Click Here


నేలమీద జాబిలీ సాంగ్ లిరిక్స్ ఆఆ ఆ ఆ ఆ ఆఆ ఆ

నేలమీద జాబిలీ

సరేలే ఊహ కాని ఊర్వశీ, ఓ ఓ

చూడగానే సుందరీ

అదేలే మల్లెజాజి పందిరీ, ఓ ఓ


తోడు కోరే వయస్సులాగ, ఆ ఆ

తొంగి చూసే మనస్సులాగా, ఆ ఆ

ఉరికి వచ్చే ఉషస్సులాగ

వరములిచ్చే తపస్సులాగ

సితారలా మెరిసిందీ, ఆ ఆ

షిఖారుగా కలిసిందీ, ఆ ఆఆ


నేలమీద జాబిలీ

సరేలే ఊహ కాని ఊర్వశీ, ఓ ఓ

ఆ ఆఆ ఆఆ ఆఆ


స్త్రీ దేవి చూపుతోని

శృంగార దీపమెట్టినట్టుగా

సింధూర సంధ్యవేళ

సిగ్గంత బొట్టు పెట్టినట్టుగా

ఆ పాల పిచ్చుక అందాలు గుచ్చగ

వాలిందమ్మ గాలివాటుగా, ఆ ఆ హోయ్

వయ్యరాల గాలి వీచగా


పచ్చబొట్టు గుండెకేసి… పైటచాటు చేసి

చందమామ లంచమిచ్చి నూలుపోగు తీసి

ఇదే తొలి అనుభూతీ, ఆ ఆ

రచించనీ రసగీతీ, ఆ ఆ


నేలమీద జాబిలీ

సరేలే ఊహ కాని ఊర్వశీ, ఓ ఓ


సంధ్యారాగం సఖి సంగీతం పాడిన వేళా

రాయని గ్రంధం రాధిక అందం అంకితమై

ఆమనీ సోకుల ఆమెని తాకిన అనుభవమే

ఎదలకు లోతున పెదవుల మధ్యన

సాగర మధనం మూగ తరంగం


చెలి చూపు సోకగానే

తొలిప్రేమ కన్ను కొట్టినట్టుగా

లేలేత చీకటింటా

నెలవంక ముద్దు పెట్టినట్టుగా


చుశాక ఆమెనీ కన్నుల్లో ఆమనీ

వేసిందమ్మ పూల ముగ్గులే, హాయ్

పట్టిందమ్మ తేనే ఉగ్గులే

ఆమె మూగ కళ్ళలోన సామవేదగానం

ఆమె చేయి తాకగానే… హాయి వాయులీనం

ఒకే క్షణం మైమరపు, ఆ ఆఆ

అనుక్షణం ఆ తలపు, ఆ ఆఆ


నేలమీద జాబిలీ

సరేలే ఊహ కాని ఊర్వశీ, ఓ ఓ

చూడగానే సుందరీ

అదేలే మల్లెజాజి పందిరీ, ఓ ఓ


తోడు కోరే వయస్సులాగ, ఆ ఆ

తొంగి చూసే మనస్సు లాగా, ఆ ఆ

ఉరికివచ్చే ఉషస్సులాగ

వరములిచ్చే తపస్సులాగ

సితారలా మెరిసిందీ, ఆ ఆ

షికారుగా కలిసిందీ, ఆ ఆఆ

Share This :sentiment_satisfied Emoticon