ఎన్నో అనుకున్నా అందామనుకున్నా సాంగ్ లిరిక్స్




 ఎన్నో అనుకున్నా అందామనుకున్నా

ఏదీ రాదేంటో పెదవులపైన

నువ్వేమనుకున్నా అన్నీ నే విన్నా

మనసే తెలిపావే మౌనములోనా


ఈ పదనిసలన్నీ మనలో కదలికలన్నీ

ఏ రేపటి కధకో సూచనా

ఈ సమయములోనా ఎగసే హృదయముపైన

ఓ వెన్నెల వాన కురిసే రంగులలోనా

కలయా నిజమా అననా


ఎన్నో అనుకున్నా అందామనుకున్నా

ఏదీ రాదేంటో పెదవులపైన

నువ్వేమనుకున్నా అన్నీ నే విన్నా

మనసే తెలిపావే మౌనములోనా


ఆ వైపు నీవు ఈ వైపు నేను

వేలాది భావాలు వేచాయి లోనా

నీ చూపులోనూ నా చూపులోనూ

మౌనానురాగాలు ఆహా స్వరాన


కలలు కలిసినాయే కొంచెం

తరగనన్నదీ సంకోచం

ప్రతొక తలపుతో మరి కొంచం

తెరలు దాటి పోదా


ఈ పదనిసలన్నీ మనలో కదలికలన్నీ

ఏ రేపటి కధకో సూచనా

ఈ సమయములోనా ఎగసే హృదయముపైన

ఓ వెన్నెల వాన కురిసే రంగులలోనా

కలయా నిజమా అననా


కొన్నాళ్ళనుండి నా ఊహలన్నీ

తారాడుతున్నాయి నీ ధ్యాసలోనే

ఇన్నేళ్ళ నుండి ఈ ప్రాణముంది

ఈనాడు నీ చెంత చేరేందుకేలే


ఏ వసంతమో అందంగా

పూలు విరిసెనే నాలోనా

ప్రాణవాయువే పరిమళమై

పరవశించిపోనా


ఈ పదనిసలన్నీ మనలో కదలికలన్నీ

ఏ రేపటి కధకో సూచనా

ఈ సమయములోనా ఎగసే హృదయముపైన

ఓ వెన్నెల వాన కురిసే రంగులలోనా

కలయా నిజమా అననా


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)