దేవతలా నిను చూస్తున్నా సాంగ్ లిరిక్స్ | Aarde Lyrics

 







దేవతలా నిను చూస్తున్నా దీపం లా జీవిస్తున్నా

నా ప్రాణం నువ్వు తీస్తున్నా నీ ధ్యానం నే చేస్తున్నా

ఎవరమ్మా నువ్వెవరమ్మా ఇంతకీ నాకు నువ్వెవరమ్మా

ఎగిరి ఎగిరి పోయింది సీతాకోకచిలక మిగిలింది నేలపై అది వాలిన మరక (2)

ఆరారో ఆరారో ఆరారో ఆరారో

దేవతలా నిను చూస్తున్నా దీపం లా జీవిస్తున్నా


సుడిగాలికి చిరిగిన ఆకు అలగదు చెలి చూపుకు నలిగినా మనసు మరవదు

నీ ఒడిలో చేరలేని నా ఆశలో ఒడిదుడుకుల ఉడుకెత్తిన నా శ్వాసలు

ఎండమావిలో సాగే పూల పడవలో గుండె దాచుకోలేని తీపి గొడవలు

అంది అందని దానా అందమైన దానా అంకితం నీకే అన్నా నను కాదన్నా

ఆరారో ఆరారో ఆరారో ఆరారో

దేవతలా నిను చూస్తున్నా దీపం లా జీవిస్తున్నా

నా ప్రాణం నువ్వు తీస్తున్నా నీ ధ్యానం నే చేస్తున్నా


నిప్పును పువ్వనుకుంటే తుమ్మెద తప్పు నెమలి కన్ను మనసు చూడలేదని చెప్పు

నీ వెన్నెల నీడలైనా నా ఊహలో నీ కన్నులు మాటాడిన నీలి ఊసులు

ఈ సమాధి పై పూసే సన్నజాజులు నిదర రాని నిట్టూర్పుల జోలపాటలు

చక్కనైన చినదానా దక్కని దానా రెక్కలు కట్టుకు రానా తెగిపోతున్నా

ఆరారో ఆరారో ఆరారో ఆరారో

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)