చెలియా నే ఇన్నాళ్ళు నా ప్రేమే చూశానమ్మ నీలో
ఇపుడీ తొలి కన్నీళ్లు ఎన్నాళ్ళు దాచాలింక నాలో
కొంచెం సుఖం... కొంచెం దుఖం... ఓ..
పంచేందుకే... ప్రేమున్నదా ఓ....

పొగరుకు రూపం నువ్వేనే పొరబడి స్నేహం చేశానే
మరువను మాత్రం మరిచానే
నిప్పని తెలిసి నిలువెల్లా చొరవగ నిన్నే తాకానే
మంటలొ హాయిగ రగిలానే
ఈ మనిషిని చంపే విషమైనా
కొంతసేపయ్యాకే ప్రాణం తీస్తుందే
ఈ ప్రేమ మాత్రం చిటికెలొ చంపుతుందే
ఇంతకన్నా వింత ఎక్కడైనా ఉందా...
చెలియా నే ఇన్నాళ్ళు నా ప్రేమే చూశానమ్మ నీలో
ఇపుడీ తొలి కన్నీళ్లు ఎన్నాళ్ళు దాచాలింక నాలో
నీ కలకంటూ లేస్తానే నీ మాటొకటే వింటానే
నీతో నీడై వస్తానే
నువ్విక దూరం అయ్యాకా మిగిలిన బతుకేం చెయ్యాలే
ఒంటరి వాణ్ణై పోయానే
నీ పెదవులు తెలిపే చిరుమాటే
నా బతుకును నడిపే ఓ బాటే
నీ మౌనం వదిలెయ్ ఈ పూటే
ప్రేమంటేనే బాధా తీరే దారే లేదా...
చెలియా నే ఇన్నాళ్ళు నా ప్రేమే చూశానమ్మ నీలో
ఇపుడీ తొలి కన్నీళ్లు ఎన్నాళ్ళు దాచాలింక నాలో
కొంచెం సుఖం... కొంచెం దుఖం... ఓ..
పంచేందుకే... ప్రేమున్నదా ఓ....
చెలియా నే ఇన్నాళ్ళు నా ప్రేమే చూశానమ్మ నీలో
ఇపుడీ తొలి కన్నీళ్లు ఎన్నాళ్ళు దాచాలింక నాలో
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon