ఎవరూ లేరని అనకు సాంగ్ లిరిక్స్

 ఎవరూ లేరని అనకు తోడుంటా నీ కడ వరకు

చీకటిలోనా వెలుగవుతా నీ కొరకూ

ఎప్పుడూ ఒంటరి అనకు నీతోనే చావూ బ్రతుకూ

కంటికి రెప్పై ఉంటా లే తుది వరకూ

ప్రేమ తోటి చెంప నిమరనా

గుండె చాటు బాధ చెరపనా

నీ ఊపిరే అవ్వనా

గడిచిన కాలమే గాయ పరిచినా

ఙ్ఞాపకాలు చేదు మిగిల్చినా

మైమరిపించే హాయి అవ్వనా

ఒట్టేసి నేను చెబుతున్నా

వదలి ఉండలేను క్షణమైనా

నీ సంతోషానికి హామీ ఇస్తున్నా

ఎవరూ లేరని అనకు తోడుంటా నీ కడ వరకు

చీకటి లోనా వెలుగవుతా నీ కొరకూ



నా మనసే నీకివ్వనా నీ లోనే సగమవ్వనా

అర చేతులు కలిపే చెలిమే నేనవ్వనా

ముద్దుల్లో ముంచెయ్యనా కౌగిలి లో దాచెయ్యనా

నాకన్నా ఇష్టం నువ్వె అంటున్నా

తడిచొస్తే తలతుడిచే చీరంచుగ నేనే మారనా

అలిసొస్తే ఎప్పుడైన నా ఒడినే ఉయ్యాల చేస్తానంటున్నా

ఎవరూ లేరని అనకు తోడుంటా నీ కడ వరకు

చీకటి లోనా వెలుగవుతా నీ కొరకూ



నిను పిలిచే పిలుపవ్వనా నిను వెతికే చూపవ్వనా

నీ కన్నుల వాకిట మెరిసే మెరుపవ్వనా

నిను తలిచే అలుపవ్వనా నీ కథలో మలుపవ్వనా

ఏడు అడుగుల బంధం నీతో అనుకోనా

మనసంతా దిగులైతే నిను ఎత్తుకు సముదాయించనా

నీకోసం తపన పడే నీ అమ్మా నాన్నా అన్నీ నేనవ్వనా

ఎవరూ లేరని అనకు తోడుంటా నీ కడ వరకు

చీకటి లోనా వెలుగవుతా నీ కొరకూ 

Share This :



sentiment_satisfied Emoticon