చిత్రం : గంగమంగ (1973)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : దాశరథి
గానం : ఘంటసాల, సుశీల
తొలి వలపులలో ఏ చెలికైనా
అలక ఉండునని విన్నాను
అది కవుల కల్పననుకున్నాను
అది కవుల పైత్యమనుకున్నాను
నీలో నాపై అలక చూసి
వలపు చేష్టలనుకున్నాను
నీ చెలిమి కోరుతూ ఉన్నాను
మాయలు చేసి మీ మగవారు
మాటలు చాలా నేర్చారు
ప్రతి మగువకిలాగే చెబుతారు
ఆడది తానై చెంతకు వస్తే
అలిగే పనులే చేస్తారు
ఆ అలకే వలపనుకుంటారు
కోరినవాణ్ని కొంగు ముడేసి
తిప్పదలచుకుంటారు
మరో మగువతో మాటాడగనే
మూతి ముడుచుకుంటారు
మొగము తిప్పుకుంటారు
ప్రేమ పేరుతొ చేకిలి నొక్కి
సరసం ఆడుతుంటారు
నిజం తెలిస్తే బుజం తడుముకొని
నీతులు పలుకుతూ ఉంటారు
సాకులు చెబుతూ ఉంటారు
తొలి వలపులలో ఏ చెలికైనా
అలక ఉండునని విన్నాను
అది కవుల కల్పననుకున్నాను
మాయలు చేసే మీ మగవారు
మాటలు చాలా నేర్చారు
ప్రతి మగువకిలాగే చెబుతారు
ఆడవారు తమ అనురాగంలో
అనుమానం పడుతుంటారు
లోపల మమత బయట కలతతో
సతమత మవ్వుతూ ఉంటారు
కుత కుత లాడుతు ఉంటారు
తేనెటీగలో ఉన్న గుణాలు
మగవారలలో ఉంటాయి
వీలు దొరికితే వారి తలపులు
దారి తప్పుతూ ఉంటాయి
పెడదారి పట్టుతూ ఉంటాయి
కలలోనైనా నా కన్నులలో
వెలుగుతున్నదీ నీ రూపం
నీ అందాలను ఆరాదిస్తూ
పూజించడమే నా ద్యేయం
జీవించడమే నా గమ్యం
కోరినవారు దూరమవుదురని
గుబులు పడును నా మనసు
నీ హృదయంలో నాపై ప్రేమ
నిండుగా ఉందని తెలుసు
అది పొంగుతున్నదని తెలుసు
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon