నమ్మేలా లేదే కల కాదే పాట లిరిక్స్ | రాజావారు రాణిగారు (2019)

 


చిత్రం : రాజావారు రాణిగారు (2019) 

సంగీతం : జయ్ క్రిష్  

సాహిత్యం : సానాపతి భరధ్వాజ పాత్రుడు  

గానం : అనురాగ్ కులకర్ణి   


నమ్మేలా లేదే కల కాదే

మనసే మేఘమాయే

కమ్మేసిందేదో ఒక హాయే

చినుకే భారమాయే

ఇయ్యాలనుంది గాని

ఉయ్యాలలూగేటి మేఘమా

జాగెందుకే సరాసరి పంపించు 

చిన్నారి చినుకుని

 

నా పెదవికి కనులతో కలహమా

నా మనసుని వదలవే బిడియమా


సీత చూపే రామ బాణం 

అయినదేమో కదా

దారేది లేక నవ్వుతూనే 

నలుగుతోంది ఎద

నా మనసుని కోసే సుతారమా 

కాసేపైనా ఆగుమా

ఓ కాలమా వేళాకోళమా

జంటై ఉంటే నేరమా

 

నా పెదవికి కనులతో కలహమా

నా మనసుని వదలవే బిడియమా


పల్లెటూరే పర్ణశాలై 

వెలుగుతోంది ఎలా

గుమ్మాన్ని దాటే ఒలిపిరల్లె 

తుళ్ళిరాకే ఇలా

నా నడకనీ ఆపే నిధానమా

నీదే నాదం నాట్యమా

ఓ దూరమా నాతో వైరమా

తారాతీరం చేరుమా

 

నా పెదవికీ కనులతో కలహమా

నా మనసునీ వదలవే బిడియమా 

 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)