తొలకరి వలపులే మనసున పాట లిరిక్స్ | ఒరేయ్ బుజ్జిగా (2020)

 చిత్రం : ఒరేయ్ బుజ్జిగా (2020)

సంగీతం : అనూప్ రూబెన్స్

సాహిత్యం : కృష్ణకాంత్ 

గానం : అర్మాన్ మాలిక్, పి.మేఘన


హో.. కురిసెనా కురిసెనా

తొలకరి వలపులే మనసున

మురిసెనా మురిసెనా 

కలలకి కనులకి కలిసేనా..

నింగిలో తారలే జేబులో దూరెనా

దేహమే మేఘమై తేలుతున్న సమయాన


విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం

కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం

హో..విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం

కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం…హో..


ఓ ఓ.. కురిసెనా కురిసెనా 

తొలకరి వలపులే మనసున

మురిసెనా మురిసెనా 

కలలకి కనులకి కలిసేనా


ఒక వరము అది… నన్ను నడిపినది

పసితనముకు తిరిగిక తరిమినది

పెదవడిగినది నీలో దొరికినది

ఒక్కసారి నన్ను నీలా నిలిపినది

చూస్తూ చూస్తూ నాదే లోకం

నీతో పాటే మారే మైకం

ఇద్దరి గుండెల చప్పుడులిప్పుడు అయ్యే.. ఏకం

హో..విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం

కావాలంది సొంతం పెరిగిందే ఇష్టం…హో..


ఓ ఓ.. కురిసెనా కురిసెనా 

తొలకరి వలపులే మనసున

మురిసెనా మురిసెనా 

కలలకి కనులకి కలిసేనా

 

కొత్త మలుపు ఇది.. నిన్ను కలిపినది

నువ్వు ఎక్కడుంటే అక్కడికే తరిమినది

చిన్ని మనసు ఇది నిన్నే అడిగినది

ఎక్కడున్నా పక్కనుండే తలపు ఇది

నిన్నా మొన్న బానే ఉన్నా

నిద్దుర మొత్తం పాడౌతున్నా

నువ్వే వచ్చే స్వప్నం కోసం వేచే ఉన్నా


కురిసెనా కురిసెనా తొలకరి వలపులె మనసున

మురిసెనా మురిసెనా కలలకి కనులకి కలిసేనా

నింగిలో తారలే జేబులో దూరెనా

దేహమే మేఘమై తేలుతున్న సమయాన


విలవిలలాడే నిన్నే చూసి ప్రాణం

కావాలంది సొంతం పెరిగిందే ఇష్టం…హో

విలవిలలాడే నిన్నే చూసి ప్రాణం

కావాలంది సొంతం పెరిగిందే ఇష్టం

  


Share This :



sentiment_satisfied Emoticon