చీకటి లాంటి పగటిపూట పాట లిరిక్స్ | అరవిందసమేత (2018)

 చిత్రం : అరవిందసమేత (2018)

సంగీతం : ఎస్.ఎస్.థమన్

సాహిత్యం : సిరివెన్నెల 

గానం : అర్మాన్ మాలిక్


చీకటి లాంటి పగటిపూట 

కత్తుల్లాంటి పూలతోట 

జరిగిందొక్క వింతవేట 

పులిపై పడిన లేడి కథ వింటారా?


జాబిలి రాని రాతిరంతా 

జాలే లేని పిల్ల వెంట

అలికిడి లేని అల్లరంతా 

గుండెల్లోకి దూరి అది చూస్తారా?


చుట్టూ ఎవ్వరూ లేరూ 

సాయం ఎవ్వరూ రారూ

చుట్టూ ఎవ్వరూ లేరూ 

సాయం ఎవ్వరూ రారూ

నాపై నేనే ప్రకటిస్తున్నా 

ఇదేమి పోరూ 


అనగనగనగా 

అరవిందట తన పేరూ

అందానికి సొంతూరూ 

అందుకనే ఆ పొగరూ..


అరెరరెరరెరే.. 

అటు చూస్తే కుర్రాళ్లూ..

అసలేమైపోతారూ.. 

అన్యాయం కదా ఇది 

అనరే ఎవ్వరూ..


ప్రతినిమిషమూ తన వెంట 

పడిగాపులే పడుతుంటా

ఒకసారి కూడ చూడకుంది క్రీగంటా

ఏమున్నదో తన చెంతా 

ఇంకెవరికీ లేదంతా 

అయస్కాంతమల్లె 

లాగుతుంది నన్నూ

చూస్తూనే ఆ కాంతా 

తను ఎంత చేరువనున్నా

అద్దంలో ఉండె ప్రతిబింబం అందునా

అంతా మాయలా ఉంది 

అయినా హాయిగా ఉంది

భ్రమలా ఉన్నా బానే ఉందే 

ఇదేమి తీరు!!


మనవే వినవే అరవిందా.. 

సరెలే అనవే కనువిందా..

మనకి మనకి రాసుందే.. 

కాదంటె సరిపోతుందా?

మనవే వినవే అరవిందా.. 

సరెలే అనవే కనువిందా..

మనకి మనకి రాసుందే.. 

కాదంటె సరిపోతుందా?


అనగనగనగా.. 

అరవిందట తన పేరూ..

అందానికి సొంతూరూ.. 

అందుకనే ఆ పొగరూ..


అరెరరెరరెరే.. 

అటు చూస్తే కుర్రాళ్లూ..

అసలేమైపోతారూ.. 

అన్యాయం కదా ఇది 

అనరే ఎవ్వరూ..


మనవే వినవే అరవిందా.. 

సరెలే అనవే కనువిందా..

మనకి మనకి రాసుందే.. 

కాదంటె సరిపోతుందా?

మనవే వినవే అరవిందా.. 

సరెలే అనవే కనువిందా..

మనకి మనకి రాసుందే.. 

కాదంటె సరిపోతుందా?

  


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)