తాండవ మాడిన తాండవ కృష్ణా పాట లిరిక్స్ | తిరుప్పావై గీతగోపాలం

 ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం

సంగీతం : వి.డి.శ్రీకాంత్

సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య

గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


తాండవ మాడిన తాండవ కృష్ణా

అండగనుండుమ హరి శ్రీకృష్ణా

తాండవ మాడిన తాండవ కృష్ణా

అండగనుండుమ హరి శ్రీకృష్ణా


శంఖము చక్రము కలవాడే

తన చంకలో బిడ్డగా మెలగాలనిన

సంతసమొందెడి దేవకీ కడుపున

వంతుగ పుట్టిన శ్రీ వాసుదేవా


రెండవ రోజున యశోద ఇంటిలో

తాండవమాడిన తాండవ కృష్ణా

తాండవమాడిన తాండవ కృష్ణా

అండగనుండుమ హరి శ్రీకృష్ణా


కట్టి కొట్టీ కనికరించినా

పట్టి పాలు వెన్నలు పెట్టినా

పుట్టిన ఇంటిని వదిలి పెట్టినా

పట్టివై యశోదకు ఇష్టుడవైనా


తాండవ మాడిన తాండవ కృష్ణా

అండగనుండుమ హరి శ్రీకృష్ణా

తాండవ మాడిన తాండవ కృష్ణా

అండగనుండుమ హరి శ్రీకృష్ణా


దేవకి కడుపున పుట్టిన వాడికీ

జీవించుటకూ తావే కరువా

దీవెనలిడుచూ సేవలు చేయుచూ

పావని అయ్యెను యశోద జననీ


తాండవ మాడిన తాండవ కృష్ణా

అండగనుండుమ హరి శ్రీకృష్ణా

తాండవ మాడిన తాండవ కృష్ణా

అండగనుండుమ హరి శ్రీకృష్ణా


కరుణే లేని కంసమామయ్యా

పాపాత్ముడు నీ అసువులు తీయగా

పాపము పండిన వాడిగ యెంచి

రూపు మాపినా గోప కిశోరా


తాండవ మాడిన తాండవ కృష్ణా

అండగనుండుమ హరి శ్రీకృష్ణా

తాండవ మాడిన తాండవ కృష్ణా

అండగనుండుమ హరి శ్రీకృష్ణా


పరుగులు తీసి వచ్చిన వారమూ

పరమను భాగ్యము పొందెడి వారమూ

క్షణమైనను నిను వీడని వారము

ఘన కార్యమ్ములా కీర్తించెదమూ


తాండవ మాడిన తాండవ కృష్ణా

అండగనుండుమ హరి శ్రీకృష్ణా

తాండవ మాడిన తాండవ కృష్ణా

అండగనుండుమ హరి శ్రీకృష్ణా 

  

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)