చిత్రం : శివరామరాజు (2002)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం : విజయ్ చిర్రావూరి
గానం : శంకర్ మహదేవన్, సుజాత
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు

అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కాదా
అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై
బ్రతకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వపుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై

పూవులెన్నొ పూచే నువ్వు నవ్వగానే
ఎండ వెన్నెలాయే నిన్ను చూడగానే
నీడపడితే బీడు పండాలి
అడుగు పెడితే సిరులు పొంగాలి
కల్మషాలు లేని కోవెలంటి ఇల్లుమాది
స్వచ్చమైన ప్రేమే పందిరల్లె అల్లుకుంది
స్వార్ధమన్న మాటే మనసులోంచి తుడిచిపెట్టి
స్నేహబాటలోనే సాగుదాము జట్టు కట్టి
వెన్నకన్న మెత్తనైన గంగకన్న స్వచ్ఛమైన
ప్రేమబంధమంటె మాదిలే
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు
అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మా ఎద
అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కాదా
అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై
బ్రతకంతా నిండు పున్నమై ముడివేసే పూర్వపుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై
హే స్వాతిముత్యమల్లే పెరిగినట్టి చెల్లి
కల్పవృక్షమల్లే కరుణ చూపు తల్లి
నలక పడితే కంటిలో నీకు
కలత పెరుగు గుండెలో మాకు
అమృతాన్ని మించే మమత మాకు తోడువుంది
మాట మీద నిలిచే అన్న మనసు అండవుంది
రాముడెరుగలేని ధర్మమీడ నిలిచివుంది
కర్ణుడివ్వలేని దానమీడ దొరుకుతుంది
నేల మీద ఎక్కడైన కానరాని సాటిలేని
ఐకమత్యమంటే మాదిలే
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు
శ్రీ లక్ష్మీ దేవి రూపము శ్రీ గౌరి దేవి తేజము
కలిసీ మా చెల్లి రూపమై వెలిసే మా ఇంటిదేవతై
సహనంలో సీత పోలిక సుగుణంలో స్వర్ణమే ఇక
దొరికింది సిరుల కానుకా గతజన్మల పుణ్యఫలముగా
కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు
సంతోష పడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon