పువ్వల్లే నా ప్రేమ తేనూరునో పాట లిరిక్స్ | కాలా (2018)

 చిత్రం : కాలా (2018)

సంగీతం : సంతోష్ నారాయణ్

సాహిత్యం : వనమాలి

గానం : అనంతు, శ్వేతామోహన్


పువ్వల్లే నా ప్రేమ తేనూరునో

ఆ నింగి తేనేల్లు కురింపించునో

చిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళల్లో ఏంటమ్మా..


ఆకాశమే లేక చిరుజల్లు ఉందా

ఏ గాయం ఎంతైన అది మానిపోదా

చిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళలో ఏంటమ్మా..


నా దేహమంతా నీ ప్రేమతావే

కాలాలు ఏమార్చెలే

ఎడమైన ప్రేమ తాకింది మంటై

దూరాలు పెరిగేనులే

నదిలాంటి ప్రేమే పయనాలు ఆపే

ఆ ఎండమావైనదే

కలలన్ని కరిగి చేజారగానే

కలతేమో బ్రతుకైనదే


చిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళలో ఏంటమ్మా..

ఆకాశమే లేక చిరుజల్లు ఉందా

ఏ గాయమెంతైన అది మానిపోదా


ఏ తీగ వీణా పలికించకుండా

రాగాలు వినిపించదే

శిశిరాన వాడే చిగురాకులాగా

నా ప్రేమ మోడైనదే

ఏ జాలి లేని విధిరాత కూడా

చేసింది ఈ గాయమే

ముడి వేయకుండా

ముగిసింది నాడే

ఈ ప్రేమ అధ్యాయమే


చిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళలో ఏంటమ్మా..

ఆకాశమే లేక చిరుజల్లు ఉందా

ఏ గాయం ఎంతైన అది మానిపోదా

చిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళలో ఏంటమ్మా..  

Share This :



sentiment_satisfied Emoticon