చిత్రం : RX-100 (2018)
సంగీతం : చైతన్ భరద్వాజ్
సాహిత్యం : శ్రీమణి
గానం : హరిచరణ్, ఉమానేహ
ఏ ఎవరే ఎవరే మనసుని పట్టి
దారం కట్టి ఎగరేసారే గాలిపటంలా
ఏ ఎవరే ఎవరే అడుగును పట్టి
చక్రం కట్టి నడిపించారే పూలరధంలా
ఎవరెవరో కాదది నీలోపల
దాక్కొని ఉండే టక్కరి నేనేగా
ఎక్కడని చూస్తావే నీ పక్కనె ఉన్నానుగా
అరె ఈ మాటే మరోసారి చెప్పెయ్
అమృతంలా వింటాలే వందలసార్లైనా ఈ పాట
వస్తాలే లక్షలమైళ్ళైనా నీ వెంట
హే తరక్ తరక్ తర తరక్ తరక్ తర తరక్ తరక్ తర
విన్నావా మైనా గుండెల్లోనా హాయిల రాగాలెన్నో
ఎగిరే ట్యూనా చేపల్లోనా సోనా మెరుపులు ఎన్నో
నీలో రేగిన వేగం కల చెరిపే గాలుల రాగం
అలజడిలో గువ్వల గొడవే నే మరిచేసా
చూసావా మబ్బుల ఒళ్లే రుద్దే
మెరుపుల సబ్బులు ఎన్నో
ఎర్రని సూర్యుని తిలకం దిద్దే
సాయంకాలం కన్ను
ఏమైనా ఇంతందం చెక్కిందెవరో
చెబుతారా తమరు
ఎవరెవరో కాదది నీలోపల
తన్నుకు వచ్చే సంతోషం ఉలి రా
చక్కగా చెక్కేందుకు నెచ్చెలిగా నేనున్నానుగా
అరె ఈ మాటే మరోసారి చెప్పెయ్
అమృతంలా వింటాలే వందలసార్లైనా ఈ పాట
వస్తాలే లక్షలమైళ్ళైనా నీ వెంట
హే తరక్ తరక్ తర తరక్ తరక్ తర తరక్ తరక్ తర
సెలయేరుకు పల్లం వైపే మళ్ళే నడకలు నేర్పిందెవరు
నేలకు పచ్చనిరంగే అద్ది స్వచ్ఛత పంచిందెవరు
ఎందుకు మనకా గొడవ నీ మాటైనా నువ్వినవా
నా తియ్యని పెదవే తినవా ఓ అరనిమిషం
ఈ ప్రేమకు పేరే పెట్టిందెవరు ప్రాయం పంచిందెవరు
వలపుకి తలుపే తీసిందెవరు తొలిముద్దిచ్చిందెవరు
ఏమైనా నాలో ఈ హైరానా తగ్గించేదెవరు
ఎవరెవరో కాదది నీలోపల
హద్దులు దాటిన అల్లరిని త్వరగా
దారిలో పెట్టేందుకు తోడల్లే నేనున్నానుగా
అరె ఈ మాటే మరోసారి చెప్పెయ్
అమృతంలా వింటాలే వందలసార్లైనా ఈ పాట
వస్తాలే లక్షలమైళ్ళైనా నీ వెంట
హే తరక్ తరక్ తర తరక్ తరక్ తర తరక్ తరక్ తర
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon