చిత్రం : జాకీ (1988)
సంగీతం : బాలసుబ్రహ్మణ్యం
సాహిత్యం : వేటూరి
గానం : బాలు
ఓ నారీ.. వయ్యారీ.. అహంకారీ..
ఓ స్వారీ చేసే నారీ వయ్యారీ
సారీ నీ దారీ ఇంకా గోదారీ
ఓ స్వారీ చేసే నారీ వయ్యారీ
సారీ నీ దారీ ఇంకా గోదారీ
కొడతావే బోల్తా ఔతావే ఉల్టా
సకిలించకే సాహిణి
ఓ స్వారీ చేసే నారీ వయ్యారీ
సారీ నీ దారీ ఇంకా గోదారీ
తగునా మగువా తగదీ తెగువా
ఈ తంటాలు నీకేల ఓ బేల తాంబేల
ఈ పందేలేల ఓ కుందేలా
సుముఖం సుహృదం భజగోవిందం
అరె నీ దమ్ము అందమ్ము చూస్తానులే
శ్రీరమా నాతో వాదమా నీకు వేదమా
కన్నేసి కౌగిళ్ళు పడతాను లేవే
కట్టేసి గుగ్గిళ్ళు పెడతాను రావే
నేనేలె నీజాకీ రావేల రాజీకి
కొంటానే కోటల్ రాణీ
ఓ స్వారీ చేసే నారీ వయ్యారీ
సారీ గోదారే ఇంక నీ దారీ
కొడతావే బోల్తా ఔతావే ఉల్టా
సకిలించకే సాహిణి
మదమా ముదమా మదమే మతమా
అరె నీ ఊపు ఉయ్యాల జంపాల
కాబోయే ఓ ఇల్లాలా
మనసే గతమా మమతే హతమా
నీ గుర్రాన్ని కట్టేయ్ వె బాల మాంచాల
కనకమయ చేల సుజన పరిపాల
నీ కళ్ళకే గంత కడతాను లేవే
నీ కళ్లమే ఈ పూట వేస్తాను రావే
ఓ పంచకళ్యాణి నా మంచి పూబోణి
గుష్మాల చల్ చల్ రాణీ
ఓ స్వారీ చేసే నారీ వయ్యారీ
సారీ నీ దారీ ఇంకా గోదారీ
కొడతావే బోల్తా ఔతావే ఉల్టా
సకిలించకే సాహిణి అరెరెరె..
ఓ స్వారీ చేసే నారీ వయ్యారీ
సారీ నీ దారీ ఇంకా గోదారీ
శ్రీమద్రమణారమణ గోవిందో హారిః
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon