చిత్రం : మనవూరి పాండవులు (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు
సిత్రాలు సేయరో..ఓ..శివుడో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
శివుడా..శివమెత్తి పాడరో నరుడో నరుడా..
నువ్వు..సిందేసి ఆడరో నరుడో నరుడా..ఆ..ఆ..
తథిన థినకు ధిన..తథిన థినకు థిన..తథిన థినకు థిన
తక..తక..తక..తక..తక..
సిత్రాలు సేయరో శివుడో శివుడా..
శివమెత్తి పాడరో నరుడో నరుడా..
ఆ..నువ్వు సిందేసి ఆడరో నరుడో నరుడా..
అండపిండ బ్రహ్మాండమంత ఆ శివుడే శివుడే..
అందులోన నలిగేది అయ్యో నరుడే నరుడే..
అండపిండ బ్రహ్మాండమంత ఆ శివుడే శివుడే..
అందులోన నలిగేది అయ్యో నరుడే నరుడే..
సిత్రాలు సేయరో..ఓ..శివుడో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
శివుడా..శివమెత్తి పాడరో నరుడో నరుడా..
నువ్వు..సిందేసి ఆడరో నరుడో నరుడా..ఆ..ఆ..
యాపకాయకన్న ఇసం..ఏమి పుచ్చకాయరా..
పాడుబుద్ది దొరగోరూ..పాముకన్న ఇసంరా..
యాపకాయకన్న ఇసం..ఏర్రి పుచ్చకాయరా..
పాడుబుద్ది దొరగోరూ..పాముకన్న ఇసంరా..
నమ్మించే దగాకోరూ..నాభికన్న ఇసంరా
నమ్మించే దగాకోరూ..నాభికన్న ఇసంరా
ఇన్ని ఇసాలు దిగిమింగే..ఏ..ఏ..ఎర్రోడే గొప్పోడురా..
సిత్రాలు సేయరో..ఓ..శివుడో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
శివుడా..శివమెత్తి పాడరో నరుడో నరుడా..
కాస్త మందేసి ఆడరో నరుడో..నరుడా..
కాని పనులు సేసినోడూ..ఊ..ఊ..భూమి ఏలుతున్నాడూ...
మంచి బుద్దులున్నోళ్ళూ..ఊ..ఊ..మట్టి కరుస్తున్నారూ...
కాని పనులు సేసినోడూ..ఊ..ఊ..భూమి ఏలుతున్నాడూ...
మంచి బుద్దులున్నోళ్ళూ..ఊ..ఊ..మట్టి కరుస్తున్నారూ...
నిన్నే బుకాయించినోన్ని..సీమయినా కుట్టదే..
శివుడూ నిన్నే..
నిన్నే బుకాయించినోన్ని..సీమయినా కుట్టదే..
మతిపోయిన పిచ్చితల్లి..మాటెవరికీ పట్టదే..
అదే సిత్రం..
సిత్రాలు సేయరో..ఓ..శివుడో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..శివుడా..
శివమెత్తి పాడరో నరుడో నరుడా..
నువ్వు..సిందేసి ఆడరో నరుడో నరుడా..ఆ..ఆ..
రయ్యాకు తాధిమి..కునకు తాధిమి..రయ్యకు తాధిమి..త్తా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon