ఒకటే కోరికా ఒకటే వేడుక పాట లిరిక్స్ | ప్రేమ కానుక (199)

 చిత్రం : ప్రేమ కానుక (199)

సంగీతం : టి.చలపతిరావు

రచన : సినారె

గానం : సుశీల, పి.బి.శ్రీనివాస్


ఒకటే కోరికా

ఒకటే వేడుక

నా మనసులోని

మధురమైన ప్రేమగీతికా

నా ప్రేమ గీతికా

ఒకటే కోరికా


అందమైన వేళలో

చందమామ నావలో

పాలవెల్లి జాలులో

తేలిపోవు కోరిక


ఒకటే కోరికా


చెలియ నీలి కురులలో

వలపులీను విరులలో

పరిమళాల డోలలో

పరవశించు కోరిక


ఒకటే కోరికా

ఒకటే వేడుకా


నా మనసులోని

మధురమైన

ప్రేమ గీతికా

నా ప్రేమ గీతికా


గున్నమావి తోటలో

కోయిలమ్మ పాటలో

సొంపులీను స్వరమునై

సోలిపోవు కోరిక


ఒకటే కోరికా


నీవే నా కనులుగా

నీవే నా తనువుగా

యుగయుగాలు ఏకమై

జగమునేలు కోరిక


ఒకటే కోరికా

ఒకటే వేడుకా


నా మనసులోని

మధురమైన

మనసులోని

మధురమైన

ప్రేమ గీతికా

నా ప్రేమ గీతికా


Share This :



sentiment_satisfied Emoticon